ముంబై రెడ్ లైట్ ఏరియాలో శ్వేతా బాసు ప్రసాద్..?

శ్వేతా బసు ప్రసాద్, జనవరి 11 1991 న బీహార్ లో పుట్టిన ఈ బామ్మ తన చిన వయసులోనే కుటుంబం తో సహా మొత్తం ముంబై కి షిఫ్ట్ అయ్యారు, ఆ తర్వాత 2000 ల ఏడాది లో చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో అందరిని ఆకట్టుకుంది, పలు సీరియల్స్ తీసిన తర్వాత బ్రేక్ తీసుకోని మళ్ళీ 2008 లో కొత్త బంగారం లోకం సినిమా ద్వారా హీరోయిన్ గా అరంగ్రేటం చేసింది.. తన మొదటి సినిమాతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది కాలేజీ ప్రేమ కథ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి ఒకటి ఒక హైలైట్ అని చెప్పాలి, ముఖ్యంగా ఈ సినిమాలో శ్వేతా బాస్ చెప్పిన ఎక్కడా డైలాగ్ ని అప్పట్లో అమ్మాయిలు ఉతపదంగా మార్చుకున్నారు.. తన అమాయకమైన మొహం తో ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు, వరుసగా సినిమాలో అవకాశాలు కూడా వచ్చాయి కానీ మొదటి సినిమా ఆడినంతగా మిగితా సినిమాలు ఆడకపోవడం సినిమాల్లో అవకాశాలు తగ్గడం తో తప్పటడుగులు వేసింది ఈ అమ్మడు..

ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న ఈమె వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది, అప్పట్లో ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రలో మారుమోగిపోయింది, ఇక ఈ ఇష్యూ నుండి బయటపడ్డాక అమ్మడు హైదరాబాద్ నుండి ముంబై కి మఖం మార్చింది కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హిందీ సీరియల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది, గ్యాప్ తీసుకోని రిఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలీవుడ్ లో మంచి అవకాశాలే వచ్చాయి, పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటూనే వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది, బిజీ బిజీ గా సాగిపోతున్న తన జీవితంకి ఒక తోడు ఉంటె బాగుండు అని అనుకుందోఏమో కానీ ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ ని పెళ్లి చేసుకుంది, ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్వేతా కి పెళ్లి కూడా పెద్దగా కలిసి రాలేదు, పెళ్ళైన ఎనిమిది నెల్లకే భర్త తో విడాకులు తీసుకోని సెపెరేట్ గా జీవించడం మొదలు పెట్టింది, ఇవ్వని పక్కకి పెట్టి తన కెరీర్ పైన ద్రుష్టి సాధించిన ఈ అమ్మడు ఇండియా లొక్డౌన్ అనే ఒక సినిమాకి సైన్ చేసింది..

ఈ సినిమాలో హీరోయిన్ ఒక వ్యభిచారి పాత్రలో కనిపించునుంది, అసలు వాళ్లు ఎలా ఉంటారు వాళ్ల జీవన విధానాలు ఏంటి అనే విషయాలని తెలుసుకోవడానికి తానె స్వయంగా ముంబై లోని రెడ్ లైట్ ఏరియా కి వెళ్ళింది, అక్కడ నివసిస్తున్న ఎంతో మంది తో మాట్లాడి తనకి తెలియని ఎన్నో విషయాలని తెలుసుకుంది అంతే కాకుండా లాక్ డౌన్ లో తిండి కూడా లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు అని వాళ్ళు చెప్పడం తో వారి కష్టాలకి కన్నీళ్లు పెట్టుకుంది, ఇక ఇండియా లొక్డౌన్ సినిమా లో తాను ఎలా ఉండాలో ప్రాక్టికల్ గా నేర్చుకుంది శ్వేతా బస్సు ప్రసాద్, ప్రతి మనిషి జీవితం లో ఒక మర్చిపోలేని పాస్ట్ ఉంటుంది, జరిగింది ఒక పీడ కలల మర్చిపోయి ముందుకు సాగితేనే జీవితం లో గెలుస్తాం అని రుజువు చేసింది శ్వేతా బసు ప్రసాద్, ఎన్నో కష్టాన్ని ఎదురుకొని కన్నీటిని దిగమింగుకుంటూ వంటరిగా జీవితం తో పోరాడిన శ్వేతా బసు ప్రసాద్ ఎంతో మందికి ఆదర్శం,తాను ఇలానే ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ మనకి వినోదాన్ని అందిస్తూ ఒక పెద్ద హీరోయిన్ గా ఎదగాలని మనం కూడా కోరుకుందాం..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles