తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదు, 70 ఏళ్ళ వయస్సు లో కూడా ఆయన నేటి తరం హీరోలతో పోటీ పడుతూ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకుంటున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు, తెలుగు ప్రేక్షకులు ఆయనని ఎలా ఆదరిస్తారో అనేది, మెగాస్టార్ అంటే మనకి ముందుకి గుర్తుకు వచ్చేది టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో అని మాత్రమే కాదు, సేవ కార్యక్రమాలకు ప్రతి రూపం అని కూడా మనకు గుర్తుకు వస్తుంది,పిల్లికి బిక్షం కూడా చెయ్యని నటీనటులతో కూడా సేవ భావం స్ఫూర్తిని కలిగించే మహానుభావుడు ఆయన, బ్లడ్ బ్యాంకు మరియు ఐ బ్యాంకు ద్వారా ఎన్నో లక్షల మందికి ఉచితంగా రక్తం మరియు నేత్రాలను దానాలు చేసిన మహానుభావుడు ఆయన, ఆ తర్వాత ఎదో మార్పు తీసుకొని రావాలనే ఉద్దేశ్యం తో రాజకీయాల్లోకి వచ్చి కుట్రలు మరియు కుతంత్రాల మధ్య నిలబడలేక రాజకీయాల నుండి తప్పుకోవాల్సి వచ్చింది, కానీ ఆ మహానుభావుడు వదిలింది రాజకీయాలను మాత్రమే, తనలో ఉన్న గొప్ప ఆదర్శాలను మరియు సేవ స్ఫూర్తిని మాత్రం ఆయన ఎప్పటికి వదలలేదు.

ఇక కరోనా సమయం లో మెగాస్టార్ చిరంజీవి అందించిన సేవ కార్యక్రమాలను అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా, ఆక్సిజన్ బ్యాంక్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరికైనా కరోనా మూలంగా ఆక్సిజన్ కొరత ఉన్న చోట్ల ఆక్సిజన్ సీలిండెర్స్ ని ఉచితంగా అందచేసి ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడిన దేవుడిలాగా నిలిచాడు, ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో వాక్సినేషన్ డ్రైవ్స్ ని ఏర్పాటు చేసి వేలాది మందికి ఉచిత వాక్సిన్ కూడా అందచేసిన ఘనత మన మెగాస్టార్ కి మాత్రమే చెందింది,ఇది ఇలా ఉండగా టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సేవ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, ఆయన గురించి మన ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియచెయ్యగ అది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది , ఆయన మాట్లాడుతూ ‘నాకు తెలిసి ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి గారు చేసే సేవ కార్యక్రమాలలో ఇతర హీరోలు 10 శాతం కూడా చేసి ఉండరు, ఆయన చేసిన సేవ కార్యక్రమాలు మనకి తెలిసినవి కొన్నే, కానీ ఒక్క రోజుకి ఆయన ఇంటి నుండి ఎన్ని లక్షల రూపాయిలు సేవ కార్యక్రమాలు కోసం వెళ్తుందో తెలుసా, అక్షరాలా పదిలక్షల రూపాయిలు,ఆయన ఇంటి నుండి ఒక్క రోజు ఆ సహాయం ఆగిపోతే కనీసం ముగ్గురు ప్రణాలు కోల్పోతాయి, అది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే’ అంటూ ఎంతో బావోద్వేగంగా ఆయన మాట్లాడాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తేకొరటాల శివ దర్శకత్వం లో అయన హీరో గా నటించిన ఆచార్య చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే,కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన కొన్ని ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని విడుదల చేయలేకపోయారు,బాగా చర్చలు జరిపిన తర్వాత ఈ సినిమా ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యబోతున్నట్టు ఇటీవలే ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు,ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా టీజర్ కి మరియు మొదటి పాట కి అటు అభిమానుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలో చిరంజీవి తో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు, తండ్రి కొడుకుల మధ్య కొరటాల శివ తెరకెక్కించిన సన్నివేశాలు అన్ని అద్భుతంగా వాచినట్టు సమాచారం, ఎన్నో భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే వచ్చే ఏడాది వరుకు ఆగాలసిందే.
