మేము మ్యాచ్ ఓడిపోవడానికి కారణం వాళ్లే..!

ఐపీల్ మొదలయింది, క్రికెట్ ఫాన్స్ కి పండుగలాంటి వాతావరణం.. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది, చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి, అయితే ఈ రోజు పంజాబ్ చెన్నై మధ్యలో జరిగిన మ్యాచ్ మాత్రం వన్ సైడ్ ఇయింది, మొదటి మ్యాచ్ లో గోరంగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ రెండవ మ్యాచ్ కి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగింది, మ్యాచ్ స్టార్టింగ్ నుండి పంజాబ్ కి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా అటు బౌలింగ్ లోను ఇటు బాటింగ్ లో అదరకొట్టింది.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ బాట్స్మన్స్ కి నిలదొక్కుకునే అవకాశమే ఇవ్వలేదు, వరుసగా వికెట్స్ పడుతూ వచ్చాయి, ఒక దశలో కానీసం పంజాబ్ 100 పరుగులైన చేస్తుందా అనే స్టేజి కి వెళ్ళింది, అతి కష్టం మీద పంజాబ్ 106 చేసి చెన్నై సూపర్ కింగ్స్ కి 107 పరుగుల టార్గెట్ ని ఇచ్చారు..

స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 15 ఓవర్లో మ్యాచ్ ని కతం చేసింది, ఓపెనర్ గా వచ్చిన గైక్వాడ్ ఐదు పరుగులకే అవుట్ అయినప్పటికీ ఆ వికెట్ పంజాబ్ పాలిట శాపంగానే మారింది వన్ డౌన్ లో వచ్చిన మోయిన్ అలీ వరుస బౌండరీలతో చెన్నై సూపర్ కింగ్స్ ని విజయానికి మరింత చేరువ చేసాడు, 31 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, అప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ విజయం దాదాపు ఖరారైపోయింది.. ఇక తర్వాత వచ్చిన రైనా కూడా వెంటనే అవుట్ అవ్వగా సామ్ కరణ్ బౌండరీ తో చెన్నై ని గెలిపించాడు..

ఇక మ్యాచ్ అనంతరం రాహుల్ ని మ్యాచ్ ఓటమి పై ప్రశ్నించగా, ఎలాంటి జట్టు కైనా 50 పరుగులలోపే ఐదు వికెట్స్ కొలిపోతే గెలవడం చాలా కష్టం అని, మేము కూడా అందుకే ఓడిపోయాం అని, అయితే చెన్నై మాత్రం మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రెండవ మ్యాచ్ కి మంచి ప్రిపరేషన్ తో వచ్చారు అని చెన్నై బౌలర్లు గ్రౌండ్ లో అదరకొట్టారు అని చెన్నై బౌలర్ల పెర్ఫార్మన్స్ వల్లే మేము ఈ రోజు మ్యాచ్ ఓడిపోయాం అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా అతి తక్కువ స్కోర్ ఉన్నపటికీ మా బౌలర్లు చెన్నై ని బాగానే కట్టడి చేసారు అని, ఈ మ్యాచ్ లో జరిగిన తప్పులు నెక్స్ట్ మ్యాచ్ లో జరగకుండా చూసుకుంటాం అని చెప్పాడు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles