మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఫుల్ HD మూవీ ఎక్సక్లూసివ్ గా మీకోసం

ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ప్రపంచ వ్యాప్తంగా ప్రాణ నష్టం ఏ స్ట్రాయిలో అయితే ఉందొ , ఆస్తి నష్టం మాత్రం దానికి పదింతలు ఉన్నాయి అన్ని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమా సమయం లో ప్రారంభం కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు ఇటీవలే ముగిసి కాస్త ఊరట ని ఇచ్చింది, ప్రముఖ ఐటీ కంపెనీలు మరియు ఎన్నో పరిశ్రమలు ఇప్పుడిప్పుడే మల్లి వ్యాపారాలను ప్రారంబించుకుంటున్నాయి, ఇక కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమలో ఒక్కటి మన తెలుగు సినీ పరిశ్రమ,సినిమా అంటే మన తెలుగు వాళ్లకి ఎంత పిచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అయితే కరోనా దెబ్బకి జనాలు మళ్ళీ థియేటర్స్ వైపు కదులుతారా లేదా అనే సందేహం ని ఈ ఏడాది క్రాక్ , ఉప్పెన , జాతి రత్నాలు మరియు వకీల్ సాబ్ వంటి సినిమాలు తెరదించాయి, సినిమా బాగుంటే జనాలు ఎలాంటి పరిస్థితి ఎదురు అయినా ఆదరిస్తారు అని మరోసారి నిరూపించి చూపాయి ఈ సినిమాలు అన్ని, ఇక సెకండ్ వేవ్ తర్వాత కూడా విడుదల అయినా అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి, అలా భారీ హిట్ సాధించినా సినిమాలలో ఒక్కటి అక్కినేని అఖిల్ మరియు పూజ హెగ్డే హీరో హీరోయిన్లు గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అనే సినిమా.

ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ కి ఈ సినిమా రూపం లో మొట్టమొదటి కమర్షియల్ హిట్ లభించింది, విడుదల అయినా మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కానక వర్షం కురిపించి దసరా విజేత గా నిలిచింది,ఆరంజ్ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి నిర్మాతలకు మరియు బయ్యర్లకు మంచి లాభాల్ని తెచ్చి పెట్టింది, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయిలు కుమ్మేసిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీ లో విడుదల కాబోతుంది, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కలను ఆహా మీడియా వారు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా నవంబర్ మొదటి వారం లో, లేదా నవంబర్ 14 వ తేదీన ఆహా మీడియా లో విడుదల కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం, మరి వెండితెర ప్రేక్షకులను ఈ స్థాయిలో అలరించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాతో మంచి హిట్ ని అందుకున్న అఖిల్ తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు, క్రియేటివ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఆయన త్వరలోనే ఏజెంట్ అనే సినిమాని చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా ని అఖిల్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం గా సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు, ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించబోతున్నాడు,ఇటీవల ఆయన లుక్ కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ ని కూడా ఆ చిత్ర యూనిట్ విడుదల చేసారు, ఎప్పుడు లవర్ బాయ్ లా కనిపించే అఖిల్ ఈ సినిమా ద్వారా స్టైలిష్ యాక్షన్ హీరో గా మారబోతున్నాడు, ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఇక నేరుగా స్టార్ హీరోల లీగ్ లోకి వెళ్ళిపోతాడు అని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఈ సినిమా కోసం కేవలం అక్కినేని అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లని ఈ సినిమా ఈ స్థాయిలో అంచనాలు పెంచింది అంటే, విడుదల సమయానికి అంచనాలు ఏ స్థాయికి చేరుకుంటాయి ఊహించుకోవచ్చు, మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles