కుటుంబ కథా చిత్రాల దర్శకుడు. ఎస్వీ కష్ణారెడ్డి ..స్టార్ కమెడియన్ అలీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ యమలీల. అంతవరకూ కమెడియన్ గా ఓ ఊపు ఊపుతున్న ఆలిని హీరోగా పెట్టి సినిమా తీయడం అంటే కత్తి మీద సామే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతటి సాహసాన్ని చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిత్ర దర్శక నిర్మాతలు. ఆలి హీరోగా సౌందర్య హీరోయిన్గా పట్టాలెక్కవలసిన ఈ యమలీల చిత్రం లోంచి హఠాత్తుగా అందాల రాశి సౌందర్య ఎందుకు నో చెప్పిందో చూద్దాం.

యమలీల సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. కామెడీ కింగ్ ఆలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన యమలీల చిత్రం అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలో ఇంద్రజ కథానాయిక. తనికెళ్ల భరణి తోట రాముడు క్యారెక్టర్ లో చేసిన కామెడీ అంతాఇంతా కాదు. ఇప్పటికీ తనికెళ్ల భరణి చూడగానే ఈ సినిమాలోని తోటరాముడు క్యారెక్టర్ గుర్తుకువస్తుంది. ఈ సినిమాలో నటించిన వాళ్లందరికీ ఎంతగానో పేరు తీసుకువచ్చింది.

అయితే.. ముందుగా ఈ సినిమాలో కథానాయికగా సౌందర్యను అనుకున్నారు. సౌందర్య కూడా ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఆతర్వాత యమలీల నుంచి తప్పకుంది. ఈ విషయం గురించి ఎస్వీకృష్ణారెడ్డిని అడిగితే.. అసలు విషయం బయటపెట్టారు. ఇంతకీ ఎస్వీ కృష్ణారెడ్డి ఏం చెప్పారంటే.. ఆరోజుల్లో సౌందర్య యమలీల సినిమాకి డేట్స్ ఇచ్చిందట. 15 రోజుల్లో షూటింగ్ ఉందనగా ఏమండీ.. నేను పెద్ద హీరోల పక్కన చేస్తున్నాను. ఇప్పుడు ఆలీ పక్కన చేస్తే.. నా మార్కెట్ పడిపోతుంది కదా.. అంటే.. నువ్వు ఫీలవుతే చేయద్దు మానేసేయ్.. ఏం ఫరవాలేదు. ఇంకో హీరోయిన్ ని పెట్టుకుంటాను అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారట.

అయితే.. మీరు హీరోగా చేయాలనుకుంటున్నారు కదా.. మీరు ఎందుకు యమలీల సినిమాలో హీరోగా చేయకూడదు అని సౌందర్య అడిగిందట. ఈ కథకి నేను ఫిట్ కాను.. క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఆలీ బెస్ట్ అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారట. నేను చేస్తే సినిమా ఆడదు. ఆలీ చేస్తే డిఫినెట్ గా సూపర్ హిట్ అవుతుంది. నీకు నచ్చకపోతే నువ్వు మానేయ్.. నేను చేయను అని ఎస్వీ చెబితే తను చేయను అని చెప్పేసిందట. అప్పుడు యమలీల కోసం ఇంద్రజను హీరోయిన్ గా తీసుకున్నారట.

ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా ఇంద్రజ చాలా బాగా నటించింది. అయితే.. సౌందర్య వాళ్ల నాన్న గారికి ఈ సినిమా గురించి చెప్పి ఇందులో సాంగ్ గురించి ఎస్వీ కృష్ణారెడ్డి చెబితే.. సౌందర్య ఫోన్ చేసి మీరు ఈ సినిమాలో చేయమని అడిగినప్పుడు నో చెప్పానని చాలా ఫీలయ్యాను. సినిమా హిట్ అవుతుందా.? అవదా అనేది కాదు.. మీరు అడిగినప్పుడు చేయను అని అనకుండా ఉండాల్సింది అని చెప్పి ఇప్పుడు సాంగ్ ఎందుకు చేయను చేస్తాను. ఆలీ పక్కన చేస్తాను అని చెప్పి సాంగ్ చేసిందట. ఇది యమలీల సినిమాలో సౌందర్య నటించపోవడం వెనక జరిగిన స్టోరీ అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి ఓ సందర్భంలో బయటపెట్టారు.
