రాకీ భాయ్ యాష్ స్పెషల్ స్టోరీ

అనుకుంటే కానిది ఎం ఉన్నది మనిషి అనుకుంటే కానిది ఎం ఉన్నది ఇలాంటి paatalu సినిమాల్లో విన్నపుడు మనకి ఎంతో ఇన్స్పిరింగ్ గా అనిపిస్తూ ఉంటాయి కానీ ఆలా అనుకున్నది సాధించాలంటే యెడ తెగాయి పోరాటం చేయాలి.. ఎన్నో ఒడిడుకులు ఎదురుకోవాలి సక్సెస్ అనేది అంత ఈజీ రాదూ, కానీ పట్టుపట్టి కష్టపడితే సాధించలేనిది ఏది లేదు అని ప్రూవ్ చేసాడు నవీన్ గౌడ.. ఈ నవీన్ గౌడ ఎవరు అనుకుంటున్నారా అందే అని మన రాకీ భాయ్ యాష్.. యాష్ అసలు పేరు నవీన్ గౌడ మరి నవీన్ గౌడ రాకీ భాయ్ గా మారడానికి జీవితం లో ఎన్ని కష్టాలు పడ్డాడు.. తన సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం..

మన రాకీ భాయ్ పుట్టించి ఒక మధ్య తరగది కుటుంబంలో, నాన్న KSRTC లో బస్సు డ్రైవర్ అమ్మ హౌస్ వైఫ్, నవీన్ గౌడ కి ఒక చెల్లి కూడా ఉంది.. పేరుకుకి మధ్య తరగది కుటుంబం ఐన నవీన్ గౌడ ని మాత్రం వాళ్ళ తల్లి తండ్రులు ఆలా పెంచలేదు పెద్ద పెద్ద వారి పిల్లలు చదువుకునే స్కూల్ లో తనని జాయిన్ చేసారు , అంతే కాకుండా తన కంఫోర్ట్స్ కి ఏలోటూ రాకుండా చూసున్నారు కానీ నవీన్ గౌడ కి మాత్రం చిన్నప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి, తాను ఏదైనా సినిమా చూడడానికి వెళ్తే కూడా ఆ హీరో చేసినట్టు గా తాను కూడా చేయాలి అని కళలు కనే వాడు, ఆలా సాగిపోతున్న తన జీవితం లో తన కల గురించి తన పేరెంట్స్ కి చెప్పే రోజు రానే వచింది.. మనది మధ్య తరగతి కుటుంబం డిగ్రీ పూర్తి చేసి ఏదైనా మంచి జాబ్ చేసుకో, అని తండ్రి మాటలు ఒకవైపు తాను కళలు కన్నా సినిమా మరోవైపు, కానీ యాష్ ఆ రోజే నిర్ణయించుకున్నాడు ఏది ఏమైనా సరే తాను అనుకున్నది ఎలా ఐన సాధించి తీరాలని, అదే విషయాన్ని తన తండ్రికి చెప్పి నేను బెంగళూరు వెళ్తాను అన్నాడు.. ఇప్పటి వరకు మైసూర్ కూడా దాటి వేళ్ళని నువ్వు..? ఎం తెలుసు అని బెంగళూరు వెళ్తావ్, అని తన తండ్రి ప్రశ్నించాడు.. నిజానికి యాష్ కి కూడా బెంగళూరు లో ఏమి తెలియదు, కానీ ఇవేవి తనకి అడ్డుగా కనపడలేదు కేవలం 300 రూపాయలతో బెంగళూరు కి వచ్చాడు యాష్, అయితే బెంగళూరు వచేటపుడు ఎంత కష్టమైన సరే ఫ్రెండ్స్ ని కానీ చుట్టాలని కానీ డబ్బులు అడగొద్దు అని నవీన గౌడ కి చెప్పాడు తన తండ్రి, ఇక ఎన్నో కలలతో బెంగళూరు లో అడుగుపెట్టిన నవీన గౌడ కి అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి.. ఎన్ని కష్టాలు ఐన పడ్తాను కానీ అనుకున్నది సాధించే తీరుతాను అని నవీన్ గౌడ నిర్ణయించుకున్నాడు, ఆలా బెంగళూరు లో సినిమా వేటలో తిరుగుతున్న అతనికి మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది, ఏ పని ఐన సరే నేను అనుకున్న ఫెయిల్డ్ లోనే కదా అని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసాడు కానీ అక్కడ నవీన్ గౌడ అనుకున్నట్టు ఏది జరగలేదు తన చేత ఛాయలు తెపించుకున్నారు, సిగరెట్లు తెపించుకున్నారు, ఇలా ఎన్ని అవమానాలైన భరించాడు, ఉండడానికి తనకి ఇల్లు కూడా లేదు, అపుడు తన చుట్టలకి ఫోన్ చేసి తన లగేజ్ ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని అడగగా వారు ఇంట్లోనే ఉండి కూడా మేము ఇక్కడ లేము అని చెప్పారు, కానీ యాష్ కి తెలుసు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని, ఎం చేయాలో అర్ధం అవ్వని యాష్ కి, తనతో పాటే పని చేస్తున్న మోహన్ అనే వ్యక్తి సహాయం చేస్తానందుకు ముందుకు వచ్చాడు.. నిజానికి వారిద్దరికీ అప్పటి వరకు హాయ్ బాయ్ అనే పరిచయం తప్ప ఇంకేం లేదు..

మోహన్ తో పాటు తన ఇంటికి వెళ్లిన యాష్ కి ఒక చిన సింగల్ బెడఁరూం లో తన ఫామిలీ మొత్తం ఉండడం చూసి తనని ఇబంది పెట్టొద్దు అని నిర్ణయించుకొని తన లగేజ్ ని మాత్రమే తన ఇంట్లో పెట్టుకుంటే చాలు అని చెప్పి నవీన గౌడ మెజెస్టిక్ బస్సు స్టాప్ లో పడుకున్నాడు, ఒకవైపు ఆకలి మరోవైపు నిద్ర పట్టకుండా దోమలు కరుస్తున్నాయి ఇంకో వైపు తన ఉరికి వెళ్ళడానికి బస్సు ఉంది, ఇంటికి తిరిగి వెళ్లాలా లేదా ఇక్కడే ఆకలి తో పోరాడాలా అనే ప్రశ తనకి తాను వేసుకొని, ఇంత కస్టపడి ఇపుడు ఇంటికి వెళ్లడం ఏంటి ఏది ఏమైనా ఇక్కడే సాధించి తీరాలి అని నిర్ణయించుకున్నాడు, అనుకున్నదే అవధుగా స్టేజి నాటకాలు చేయడం ప్రారంభించాడు, అక్కడే నవీన గౌడ తన పేరు ని యాష్ గా మార్చుకున్నాడు, ఆలా నాటకాలు చేస్తున్న తనకి కన్నడ సీరియల్ లో అవకాశాలు వచ్చాయి, ఆలా 2004 నుండి 2007 వరకు సీరియల్స్ చేస్తూ గడిపేశాడు.. ఆలా సీరియల్ చేస్తున్న తనకి జంబడు అడిగి అనే సినిమాలో అవకాశం వచ్చింది, ఈ సినిమాలో తాను చేసింది మెయిన్ రోలా కాకపోయినా అప్పటి వరకు తనని వేలు ఎత్తి చూపించిన వారికి ఈ సినిమా ఒక సమాధానం ఇయింది..

ఆ తర్వాత మొగ్గిన మనసు అనే సినిమా లో ఫస్ట్ టైం లీడ్ రోల్ గా అవకాశం వచ్చింది, ఎన్నో ఏళ్ళ కల నిజం ఇయింది యాష్ కి వచ్చిన అవకాశంగా సద్వినియోగం చేసుకున్నాడు, ఈ సినిమా గణ విజయం సాధించింది, యాష్ కి కూడా ఈ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు వచ్చింది, ఆ తర్వాత తాను నటించిన కొని సినిమాలు పెద్దగా ఆడకపైనా మధోలస సినిమా లో తన పెరఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు, ఆ తర్వాత గూగిలి సినిమా తో హైగెస్ట్ గ్రాస్సర్ of ది ఇయర్ అవార్డు ని తన కాతాలో వేసుకున్నాడు, ఆ తర్వాత వచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి సినిమా తో ఫస్ట్ 50 crore కన్నడ సినిమా ని తన కాతాలో వేసుకున్నాడు, అంతే కాకుండా ఈ సినిమా తో హైయెస్ట్ పైడ్ కన్నడ ఆక్టర్ గా ఎదిగాడు, ఆ తర్వాత తాను ప్రేమిస్తున్న రాధికా పండిత్ ని పెళ్లి చేసుకున్నాడు, వీరిద్దరూ కలిసి పలు సీరియల్స్ లో కూడా నటించారు.. ఇక యాష్ ఆ తర్వాత ఎప్పుడు వెను తిరిగి చూడలేదు మాస్టర్ పీస్ సినిమా తో ఫస్ట్ 100 crore ఫిలిం ఇన్ వన్ వీక్ గా రికార్డు బాధలు కొట్టాడు ఆ tarwtha తనకి లైఫ్ ఇచ్చిన కనడ సినిమా ఇండస్ర్టీ ని ప్రపంచం అంత పొగిడేలా చేయాలి అను అనుకున్నాడో ఏమో కానీ, అప్పటి వరకు తాను పడ్డ కష్టానికి ఫలితంగా కెజిఫ్ సినిమా నిలిచింది.. ఈ సినిమా పాన్ ఇండియా స్థలిలో రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ బాధలు కొట్టిందో వేరేగా చెప్పక్కర్లేదు, ఇక ఇపుడు కెజిఫ్ 2 కూడా వాస్తు ఉండడం తో, యాష్ కి తాను ఏ బస్సు స్టాప్ లో అయితే ఆకలితో పడుకున్నాడో అదే బస్సు స్టాప్ లో 216 అడుగుల అతి పెద్ద కట్ అవుట్ ని పెట్టారు.. ఇది కదా అసలు సక్సెస్ అంటే, యాష్ స్టోరీ మనలో చాల మందికి ఒక ఇన్స్పిరేషన్, hatsof to రాకీ భాయ్ ఇలాన్నే ఎన్నో పెద్ద పెద్ద హిట్స్ తన కాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.. అల్ ది బెస్ట్ యాష్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles