రామాయణం ” భక్తితో చదివితే పురాణం.. వికాసం కోసం చదివితే విజ్ఞానం. రామాయణం లో రాముడు సీత కోసం లంకకు వెళ్ళాడు.లంకలో సీత రాముడి కోసం ఎదరు చూసింది.వారికి ఒకరిమీద ఇంకొకరికి ఉన్న నమ్మకం, ప్రేమ ఒక్క మాటలో చెప్పాలంటే రాముడు లేనిది సీత లేదు సీత కోసమే శ్రీ రాముడు.

రామాయణం లో సీత మాత “సీతామడ్” అనే ప్రాంతం లో దొరికింది. జనకుడు తనకు పిల్లలు పుట్టాలని యాగం చేసి నాగలి తో భూమీ ని దున్నతున్న సమయం లో సీత బయటకు వచ్చింది. జనకుడి కూతురు జానకి గ పెరిగి స్వయంవరం లో శివధనుస్సు ను విరిచిన రాముడు కి భార్యా గా అయోధ్యలో అడుగు పెట్టింది. కానీ సీత కష్టాలు కూడా అపుడే మొదలయ్యయన్ని చెప్పాలి. పట్టాభిషేకం అయ్యే రోజే వనవాసనికి వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడ రాముడి చెయ్ వదలకుండా వనవాసాని కూడా రాజ భోగం లా తలచి ఒకరికి ఒకరుగా ఉంటున్నారు.అయితే రావణుడి వల్ల సీత మాత రాముడికి దూరం అవ్వలసి వచ్చింది. చివరికి రామ రావణ యుద్ధం లో ధర్మం గెలిచింది.

ఇక సీత మాత అయోధ్య కి వెళ్ళాక పరుల నింద వల్ల ఆమెను రాముడు అడవుల్లో వదిలేసాడు. అయితే ఇక్కడే మన అసలు కథ మొదలవుతుంది. రాముడు లక్సమణుడితో సీత మాతను జనక పురం నుండి కొన్ని యోజనాల దూరం లో వదిలేయమన్నాడు. అలా అయితే సీత మాత తన తండ్రి దగ్గర వెళ్లి అక్కడ అయిన క్షేమం గా ఉంటుంది అని రాముడు భావించి ఉంటాడు కానీ సీత నింద ని మోస్తూ పుట్టింటింటికి వెళ్లలేక పోయింది అక్కడే వాల్మీకి ఆశ్రమం లో లవకూషులకు జన్మనిచింది.ఈ ఆశ్రమం మన దేశం లో ఉన్న కన్పూర్ దగ్గర లోని బీటూర్ ప్రాతం గా చెప్పుకుంటారు.కానీ వాల్మీకి రామాయణం లో చెప్పిన కొన్ని గుర్తులు మాత్రం ఇక్కడ మనకు కనపడవు ఆయన ఆశ్రమాన్ని కొన్ని నధుల సంగమ స్థానం లో ఉన్నటుగా వర్ణించాడు. నేపాల్ లో మాత్రం ఆయన చెప్పినదానికి సరిగ్గా సరిపోయే ఒక ప్రాంతం ఉంది. దాన్ని చిత్వన్ అని పిలుస్తారు అక్కడే లవకుష్ జన్మ స్తల్ కూడా ఉంది. ఇది జనక్ పుర్ మరియు మితిల కు దగ్గర గా ఉంటుంది. లక్మానుడు ఇక్కడే సీత మాతను వదిలివెళ్లడని చెప్తారు. ఇక్కడ కొన్ని అవశేషాలు కూడా ఈ వాదనను బలపరుస్తాయి. చిత్వన్ లో సీత మాత వంటశాల, వాల్మీకి ఆశ్రమం కూడా ఉన్నాయ్. శ్రీ రాముడు మొదలుపెట్టిన అశ్వామేద యాగం లో వదిలిన గుఱ్ఱన్ని లవకూషులు పట్టుకొని ఇక్కడే ఒక స్థంబానికి కట్టేసారు .ఆ స్థంబం ఇంకా ఇక్కడే ఉంది. హనుమంతుల వారిని లవకూషులు పట్టుకొని బంధీంచిన చోటు, లవకూషులకు రాముడికి జరిగిన యుద్ధం లో రామ సైన్యం లో ఉన్న వారు లవకూషుల దాటికి మూర్ఛ పోతే వాల్మీకి మహర్షి ఇక్కడ ఒక బావి నీటిని వారి మీద చల్లి తిరిగి లేపారు. ఆ బావిని అమృత్ కుఆ అంటారు.

ఇక రామాయణం లో వాల్మీకి చెపినట్టు ఆశ్రమానికి దగ్గరలో మూడు నధుల సంగమం ఉంది అన్నాడు ఇక్కడ కి దగ్గరలో మూడు నదుల సంగమం శ్వేతా గంగ, సోన్ గంగ, కాళీ భద్ర కూడా సంఘమిస్తున్నాయి. అశ్వామేద యాగా నికి బయలుదేరిన తన సైన్యం తన అశ్వం అడవిలో చిక్కుకున్నాయి అని తెలిసి పరివారం తో వచ్చి అశ్వని బంధీంచిన పిల్లలు లవకూషులు అని పైగా వారు తనపిల్లలు అని తెలిసి అపుడే అక్కడకు వచిన సీత మాతను చూసి ఉద్వేగం తో ఆమెను ముట్టుకోడానికి ముందుకెళ్ళాడంట అంతే సీత మాత తన తల్లి భూమాత ను ప్రార్ధించింది. వెంటనే ఒక పెద్ద భూకంపం వచ్చి సీత మాత భూమీలోకే వెళ్ళిపోయింది. ఇక్కడ సీత మాత పాతలం లోకి వెళ్లిన ప్రాంతం కూడా ఉంది . అక్కడే సీత మాత కి పూజలు నిర్వహిస్తారు. సీత మాత వెళ్లిపోయిన తర్వాత రాముడు లవకూషుల్కకి రాజ్యానికి ఇచ్చి సరియు నది ఒడ్డున నిర్యానం పొందాడు.

భూమి కి ఉనంత ఓర్పు తో ఎన్ని కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఎదురైనా ఓర్పుతో భరించింది.. మళ్ళీ తన తల్లి ఒడిలోకే వెళ్ళిపోయింది.
