రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఏ ఒకరు ఆలా చేసిన RRR సినిమా ఉండేది కాదు..

రాజమౌళి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు, అపజయం ఎరుగుగాని డైరెక్టర్, తాను సినిమా తీస్తున్నాడంటే చాలు ప్రేక్షలుకు ఆ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు.. ప్రభాస్ తో బాహుబలి తీసిన రాజమౌళి ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమా ని రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ తో కలిసి తీస్తున్నట్టు ప్రకటించాడు.. ఇక ఈ సినిమా ప్రకటించిన తేదీ నుండి అటు మెగా ఫాన్స్ ఇటు నందమూరి ఫాన్స్ ఈ సినిమా ఎపుడెపుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు గా కనిపించగా, కొమరం భీం గా ఎన్టీఆర్ అలరించనున్నారు, ఇక ఇప్పటికే ఈ సినిమా విదుదల తేదీ కూడా ఖరారవ్వడం తో జక్కన అనుకున్న సమయానికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్ భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, జక్కన, ఇంకా ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ప్రెస్ తో ముచ్చటించారు, ఈ మీటింగ్ లో పలు ప్రశ్నలకి చిత్ర బృందం సమాధానాలు ఇచ్చారు, ఒక మీడియా ప్రతినిధి డీవీవీ గారిని మీరు ఈ సినిమా వదులుకుంటే 100 కోట్లు ఇస్తాం అన్న ఆఫర్ వచ్చిందట కదా అని అడగగా, దానికి అతను సమాధానం ఇస్తూ, అవును మీరు విన్నది నిజమే నాకు 100 కోట్ల ఆఫర్ వచ్చింది కానీ ఎన్ని కోట్లు ఇచ్చిన నేను ఈ సినిమాని వదులుకోను రాజమౌళి తో సినిమా తీయడం అనేది నా కల అందుకే నేను ఆ ఆఫర్ కి నేను నో చెప్పను అంటూ చెప్పుకొచ్చాడు..

ఇక ఆ తర్వాత ఒక విలేకరి ఈ సినిమా ని రాజమోళి కాకుండా వేరే ఏ ఇతర డైరెక్టర్ ఐన డైరెక్ట్ చేస్తే మీరు ఈ సినిమా కి ఓకే చెప్తారా అని ఇద్దరు హీరోలని, రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ కాకుండా వేరే ఏ హీరోల తో ఐన ఈ సినిమా తీయాల్సి వస్తే ఏ హీరోల ని తీసుకుంటారు అని రాజమౌళి ని ప్రశ్నించగా, రాజమౌళి గారు ఈ కథ చెప్పినపుడు మాకు నచ్చి మేము ఈ సినిమా చేస్తున్నాం, ఒకవేళ మీరు చెప్పినట్టు ఫ్యూచర్ లో మారె డైరెక్టర్ ఐన మంచి కథ తో వస్తే ఆ కథ మాకు నచ్చితే చేస్తుండొచ్చేమో అని రామ్ చరణ్ సమాధాం ఇవ్వగా, నేను ఈ సినిమా కోసం కేవలం చరణ్ ఇంకా ఎన్టీఆర్ ని మాత్రమే హీరోలు గా అనుకున్న ఒకవేళ వీరిద్దరిలో ఏ ఒక్కరు ఈ సినిమాకి ఒప్పుకోకున్న నేను ఈ సినిమా అసలు చేసే వాడినే కాదు అంటూ సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు, కానీ ఈ సమాధాం వింటే మనకి జక్కన ఒక సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమా పట్ల ఎంత పర్టికులర్ గా ఉంటాడో అర్ధం చేసుకోవొచ్చు..

అంతే కాకుండా ఈ సినిమా తీయడానికి టైం కొంచెం ఎక్కువ పట్టిన కూడా ఇండస్ట్రీ ని నమ్ముకున్న ఎంతో మందికి ఈ సినిమా ద్వారా పని కలుగుతుంది అని చెప్పొకొచ్చాడు, ఇక ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13 న విడుదల చేస్తునట్టుగా ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది, అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదలైతే అభిమానులకి పంగడే అని చెప్పొచ్చు, ఇక ఈ సినిమా విడుదల అయ్యాక ఎన్ని రికార్డ్స్ ని బాధలు కొడుతుందో వేచి చూడాలి మరి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles