రోడ్ పైన లుంగీలు అమ్ముకునే అలీ ఇంత గొప్ప నటుడు ఎలా అయ్యాడు..?

ఎవ్వరి జీవితంలో ఐన మలుపులు సహజం, మనం ఒకటి అనుకుంటూ జీవితం ఇంకో వైపు నడిపిస్తుంది, ఇది మనలాంటి సామాన్యులకే కాదు స్టార్స్ గా ఎదిగిన సెలెబ్రిటీలకి కూడా వర్తిస్తుంది, సినిమా ఏదైనా అందులో కామెడీని కోరుకుంటారు ప్రేక్షకులు అందుకే సినిమా డైరెక్టర్లు కూడా తాము తీసే సినిమాలో కామెడీ కి పెద్ద పీట వేస్తారు.. ఆనాడు రేలంగి, రాజా బాబు దెగ్గర నుండి ఈ నాటి వరకు ఇండస్ట్రీ కి ఎంతో మంది కమెడియన్స్ వచ్చి ప్రేక్షకులని నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, ఆలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ అలీ ఒకరు, హీరో గా, కమెడియన్ గా మెప్పించిన అలీ నిజానికి ఇండస్ట్రీ కి రాకముందు ఎం చేసే వాడో తెలుసా..? అలీ అసలు ఇండస్ట్రీ కి ఎలా వచ్చాడు అనే విషయాలని ఇపుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అలీ, రోడ్లపై లుంగీలు లంగాలు అమ్ముకునే వాడు ఆలా రోడ్లపై లుంగీలు అముతున్న అలిని చుసిన ఆర్కెస్ట్రా నడిపే మోహన్ మిత్ర అనే పెద్దయిన అలీ దెగ్గరికి వెళ్లి ఇవ్వని నువు ఎలా అమ్మగల్గుతున్నావ్ అని అలీని ప్రశ్నించగా అతనికి ఎటకారంగా సమాధానం ఇచ్చాడు అలీ, దింతో మోహన్ మిత్ర గారికి కోపం వచ్చింది అక్కడే ఉన్న అలీ గారి నాన్న గారు వచ్చి ఏమైంది గురువు గారు మా పిల్లడు ఏమైనా ఇబంది పెట్టాడా అని అడగగా అలాంటిది ఎం లేదు అంటూ నవ్వుతు సమాధాం ఇచ్చిన మోహన్ మిత్ర, పిల్లవాడి తో ఈ పనులు చేపిస్తున్నావ్ ఏంటి అని అడగగా అపుడు అలీ వాళ్ళ నాన్న గారు ఇతడికి చదువు రావట్లేదు గురువు గారు అందుకే ఈ పనులు చూపిస్తున్నాను అని సమాధానం ఇచ్చారు, అపుడు మోహన్ మిత్ర గారు అలీని నీకు ఎం వొచ్చు అని అడగగా షోలే సినిమాలోని డైలాగ్స్ అని చెప్పాడు..

అలీ ఆలా డైలాగ్లు చెప్పడం చూసి ఆశర్యపోయిన మోహన్ మిత్ర గారు ఆ తర్వాత అదే సినెమాలోనుండి పాటలు పాడగా అలీ ఆ పాటలకి సినిమలో స్టెప్పులు ఎలా అయితే ఉన్నాయో అలానే డాన్స్ చేసి మెప్పించాడు, ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీఆర్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ని మిమిక్రీ చేసి మెప్పించాడు, అలీ లో ఈ టాలెంట్ ని గుర్తించిన మోహన్ మిత్ర గారు తనతో పాటు షోస్ చేయడానికి వస్తావా అని అలీ ని అడగగా అలీ వస్తాను అని సమాధాం ఇవ్వడం తో అప్పటి నుండి మోహన్ మిత్ర గారు చేసే ప్రతి ఆర్కెస్ట్రా ప్రోగ్రాం కి అలీ ని తీసుకోని వెళ్లే వాడు, అక్కడ అలీ డాన్సులు మిమిక్రీ చేసి అందరిని అలరించేవాడు..

ఆ తర్వాత ఒకనాడు విశ్వనాధ్ గారు నా సినిమాలో నటించడానికి ఒక పిల్లవాడు కావాలి అని మోహన్ మిత్ర గారిని అడగడం తో, విశ్వనాధ్ గారికి అలీ ని పరిచయం చేసాడు, అలీ డాన్స్ ఇంకా మిమిక్రీ చూసి ఇంప్రెస్స్ ఐన విశ్వనాధ్ గారు ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చాడు, ఆ తర్వాత భారతి రాజా గారు చేసిన సీతాకోకచిలుకలు సినిమాలో కూడా ఒక మంచి రోల్ చేసాడు, తన నటనతో అందరిని అలరించిన అలికి సినిమాలో అవకాశాలు కూడా వెల్లువలా వచ్చాయి, ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తన గురువు గారు ఐన మోహన్ కృష్ణ గారితో స్టేజి పై ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండే వాడు..

ఆలా మంచి మంచి రోల్స్ చేస్తూ తన నటనతో అందరిని ఆకట్టుకున్న అలీ యమలీల సినిమాలో హీరోగా చేసే అవకాశం దక్కించుకున్నాడు, ఈ సినిమా బ్లాక్బుట్సర్ హిట్ ఇయింది, సినిమా ఎంత పెద్ద హాట్ ఐనప్పటికీ అలీ లో మాత్రం కొంచెం కూడా గర్వం పెరగలేదు, యమలీల సినిమా తర్వాత తన గురువుగారి ఆర్కెస్ట్రా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి ఎంతో మంది పెద్ద పెద్ద వారితో పాటు అలీ కూడా గెస్ట్ గా వచ్చాడు, గెస్ట్ గా వచ్చినప్పటికి అలీ ఆ స్టేజి పైన తన గురువుగారి పాటలకి డాన్స్ చేసి మెప్పించాడు, ఆలా తన నటనతో అందరిని ఆకట్టుకుంటూ ఒకో స్టెప్ ఎక్కుతూ అలీ గారు ఈ స్టేజి వరకు వచ్చారు..

అలీ గారు ఇండస్ట్రీ కి వచ్చి 40 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఈ మధ్య అలీ గారికి ఒక సన్మాన సబ ఏర్పాటు చేయగా ఆ సభలో అలీ గారు మాట్లాడుతూ ఇక్కడ సన్మానం జరగాల్సింది నాకు కాదు, ఆ సన్మానం మా అమ్మగారికి ఇంకా మా గురువు గారికి చేయదని అని చెప్పి తనలో ఉన్న కృతజ్ఞత బావని చాటుకున్నాడు అలీ, సినిమాలో కమెడియన్ గా ఎదిగిన అలీ కామెడీ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ప్రేక్షకులు మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు, అలీ తన జీవితంలో మరిన్ని విజయాలు అందుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles