వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు అంటూ మన చిన్నపుడు వచ్చిన అడ్వేర్టైస్మెంట్ మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది కదా, మన అందరికి గుర్తుండిపోయిన ఈ యాడ్ వెనుక ఒక కన్నీటి కథ దాగి ఉంది, నిజానికి వాషింగ్ పౌడర్ నిర్మా ప్యాక్ పైన ఉన్న అమ్మాయి ఆ అడ్వేర్టైస్మెంట్ వచ్చే సమయానికి అసలు బ్రతికి లేదు, ఆమె చనిపోతే ఈ యాడ్ పైన ఆమె ఫోటో ఎందుకు ఉంది అనే డౌట్ మిలో చాల మందికి రావొచ్చు, ఆమె ఎలా చనిపోయింది..? అసలు ఆమె పేరు పైన ఈ నిర్మా వాషింగ్ పౌడర్ ఎవరు స్టార్ట్ చేసారు అనే విషయాలని మనం ఇపుడు తెలుసుకుందాం..

గుజరాత్ కి చెందిన కార్సన్ భాయ్ పటేల్ అనే ఒక వ్యాపారవేత్తకి సబులు ఇంకా సర్ఫ్ తయారు చేసే బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ లో తనకి ఎక్కువ లాభాలు రాకపోవడం తో కొత్తగా ఏదైనా చేయాలి అని అనుకున్నాడు, తనకి నిర్మా అనే ఒక కూతురు ఉంది ఆమె అంటే ఇతడికి ఎంతో ఇష్టం ఆమె పేరు పైన ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు కానీ ప్రమాదవశాత్తు ఆమె ఒక ఆక్సిడెంట్ లో చనిపోయింది, కూతురు చనిపోవడం తో విపరీతంగా బాధపడ్డ తాను తన కూతురికోసం ఏదైనా చేయాలి అని అనుకున్నాడు అపుడే తనకి తాను చేస్తున్న బిజినెస్ కి నిర్మా అనే పేరు పెట్టాలి అనే ఆలోచన వచ్చింది, తాను అప్పటికే అదే బిజినెస్ లో ఉండడం తో ఆ బిజినెస్ కి సంబందించిన ప్రొడక్ట్స్ అని నిర్మా బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చాడు, ఈ బిజినెస్ ని సక్సెస్ చేస్తే తన కూతురి జ్ఞ్యాపకంగా ఎప్పటికి ఇది గుర్తుండిపోతుంది అని పగలు రాత్రి కస్టపడి ఈ బిజినెస్ ని సక్సెస్ చేసాడు..

అయితే మీరు నిర్మా పైన ఉన్న పాపా బొమ్మని గమనించినట్లయితే ఆ ఫోటో అంత క్లారిటీ గా మనకి కనిపించదు ఎందుకంటే అప్పట్లో కెమరాలు పెద్దగా లేవు కాబట్టి, తన కూతురి ముఖ్య చిత్రాలు పోలేలాగా ఒక ఆర్టిస్ట్ తో తన కూతురి బొమ్మ వేయించాడు, అదే బొమ్మని నిర్మా పై బ్రాండ్ ఇమేజ్ గా వాడి తన కూతురు చనిపోయిన తర్వాత తన జ్ఞపలకి గుర్తుగా ఈ బిజినెస్ ని చేస్తున్నాడు.. ఇది కథ తండ్రి ప్రేమ అంటే, ప్రతి తల్లి తన బిడ్డని ఎత్తుకుంటుంది ఎందుకంటే తాను చూసే ప్రతిదీ తన బిడ్డ కూడా చూడాలని కానీ తండ్రి మతం తన బిడ్డని భుజాలపైన కుర్చోపెట్టుకుంటాడు ఎందుకంటే తాను చూడనిది కూడా తన పిల్లలు చూడాలి అని, సర్రిగా ఇలానే కార్సన్ భాయ్ పటేల్ కూడా అలోచించి తన కూతురు చనిపోయిన తర్వాత కూడా తాను ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసాడు..
