శివుడి కంటి నుండి కింద పడ్డ నీటి చుక్కే రుద్రాక్ష గా మారింది అని మీకు తెలుసా ?

రుద్రాక్ష పుట్టుక, దాని మహిమలు? రుద్రాక్షలు ఎన్ని రకాలు, వాటి ఫలితాలు? నిజమైన రుద్రాక్షలను ఎలా కనిపెట్టవచ్చు? రుద్రాక్షలు ఏ సమయంలో ధరించాలి? రుద్రాక్ష ధారణలో పాటించాల్సిన నియమాలు? స్త్రీలు రుద్రాక్షలు ధరించవచ్చా అన్న సందేహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం?

ముందుగా మనం రుద్రాక్షలు ఎలా పుట్టాయి వాటి మహిమలేంటో తెలుసుకుందాం.. రుద్రాక్ష పుట్టుక సంబంధించి ఒక పురాణ గాధ ఉంది. పూర్వం శివుడు, దేవతలను రక్షించుటకు త్రిపురాసురుడు అను రాక్షసుడిని సంహరించడానికి మహాస్త్రమును రూపొందించి, చేపట్టడానికై కొన్ని వేల సంవత్సారాలు తదేక ధ్యానం చేయుట జరిగింది. తరువాత శివుడు తన ధ్యానాన్ని విరమించి మహాస్త్రమును చేపట్టడానికి కళ్ళు తెరవగా శివుని కళ్ళ నుండి నీటి బిందువులు రాలి భూమిపై పడి రుద్రాక్ష చెట్లుగా రూపాంతరం చెందాయని పురాణాలు చెబుతున్నాయి. ఇవి రుద్రుని అక్షముల నుండి రాలి మొలకెత్తినవి కనుక వాటికి రుద్రాక్ష అనే పేరు వచ్చింది.

మరోవైపు భగవత్ సృష్టికి వ్యతిరేకంగా విశ్వామిత్రుడు కొన్నిచేసి వాటిని భద్రాక్షలుగా సృష్టించాడని చెప్పుకుంటున్నాం. భద్రాక్షలు శివుని సృష్టి కాదని, రుద్రాక్షలు మాత్రమే శివుని సృష్టి అని పురాణాలు చెబుతున్నాయి. వాటి మహిమలను చూసినట్లయితే, ఎవరైతే రుద్రాక్షలను పవిత్రంగా భావించి శాస్త్రానుసారంగా పూజించి, మనస్ఫూర్తిగా నమస్కరించి ధరిస్తారో అటువంటి వారి సర్వపాపాలు నశిస్తాయి. అలాగే అటువంటి వారు సంపూర్ణమైన ఆరోగ్యమును పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.

ఇప్పుడు రుద్రాక్షలు ఎన్ని రకాలు, వాటి ఫలితాలను చూద్దాం…
ఏకముఖి రుద్రాక్ష: పరమ శివుడికి ప్రతీక, దీనిని ధరిస్తే కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయి. ద్విముఖి రుద్రాక్ష: ఇది దేవతా స్వరూపం, ఈ రుద్రాక్షను ఓం నమః అని జపంచి ధరించినట్లైతే -పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం, దంపతుల మధ్య అన్యోన్యత కలుగును. త్రిముఖి రుద్రాక్ష: అగ్నిదేవుని స్వరూపం, దీనిని ధరిస్తే అందరితో సఖ్యత కుదురుతుంది. చతుర్ముఖి రుద్రాక్ష: బ్రహ్మదేవుని ప్రతీక, దీనిని ధరిస్తే బుద్ధి వికసించి జ్ఞానం కలుతుంది. పంచముఖి రుద్రాక్ష: కాలాగ్ని స్వరూపిణి, దీనిని ధరిస్తే సర్వపాపాలు తొలుగుతాయి. షణ్ముఖి రుద్రాక్ష: కార్తికేయుని ప్రతీక, దీనిని ధరిస్తే -విజయం ప్రాప్తిస్తుంది. సప్తముఖి రుద్రాక్ష: సప్తస్వరాలు ప్రతీక, దీనిని ధరిస్తే- అకాలమృత్యు దోషాలు తొలగుతాయి. అష్టముఖి రుద్రాక్ష: మహాగణపతి ప్రతీక, దీనిని ధరిస్తే- అన్ని సమస్యలు నివారణమవుతాయి. నవముఖి రుద్రాక్ష: కనకదుర్గ అమ్మవారి ప్రతీక, దీనిని ధరిస్తే- దారిద్య్రములన్ని నశిస్తాయి. దశముఖి రుద్రాక్ష: శ్రీ మహావిష్ణువుకు ప్రతీక, దీనిని ధరిస్తే- శాంతి కలుగుతుంది. ఏకాదశముఖి రుద్రాక్ష: మహేంద్రుడి ప్రతిరూపం, దీనిని ధరిస్తే- అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతారు. ద్వాదశముఖి రుద్రాక్ష: ఇంద్రునికి ప్రతీక, దీనిని ధరిస్తే- ఆయురారోగ్యములు కలుతాయి. త్రయోదశముఖి రుద్రాక్ష: దీనిని ధరిస్తే- సంతానం కలుగుతుంది మరియు సర్వసుఖాలు లభిస్తాయి. చతుర్దశముఖి రుద్రాక్ష: హనుమంతునికి ప్రతిరూపం, దీనిని ధరిస్తే- సమస్త సౌభాగ్యములు కలుగుతాయి.

నిజమైన రుద్రాక్షలను ఎలా కనిపెట్టవచ్చో ఇప్పుడు చూద్దాం…
రుద్రాక్షలను నీటిలో వేయగానే ములుగుతాయని కొందరు, తేలుతాయని కొందరు చెబుతారు. కానీ పురాణాల ప్రకారం పరిపక్వానికి వచ్చి, రాలిన రుద్రాక్ష నీటిలో తేలుతుందని చెబుతున్నారు. మంచి రుద్రాక్షలను నీటిలో వేసి, ఆ నీటి ఉష్ణోగ్రతను గమనిస్తే ముందుకన్నా 4-5 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతను మనం గమనించవచ్చు. అలాగే మంచి రుద్రాక్షలను పాలలో వేసినట్లయితే పాలు పాడవవు. మరోవిధంగా కూడా మనం మంచి రుద్రాక్షలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక పంచముఖి రుద్రాక్షను తీసుకుని, దానిని ఎక్స్రే మిషన్ లో పెట్టినట్లయితే దానిలో ఐదు విత్తనాలు కనిపిస్తాయి. అలాగే ఒక రుద్రాక్షను తీసుకుని దానికి ప్రతి ముఖం వద్ద చీల్చి చూసినట్లైతే ప్రతీ ముఖం వద్ద కూడా ఒక్కో విత్తనం కనిపిస్తుంది. ఇలా మనం మంచి రుద్రాక్షలను ఎంపిక చేసుకోవచ్చు.

రుద్రాక్షలను ఏ సమయంలో ధరించవచ్చో ఇప్పుడు చూద్దాం…
ఎన్ని ముఖాలు కలిగిన రుద్రాక్షలను ధరించినా, వాటిని గంగా జలముతో శుద్ధి చేసి, దానికి సంబందించిన మంత్ర జపం చేసి సోమవారం ప్రాతః కాలంలో ధరించడం మంచిదని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు రుద్రాక్ష ధారణలో పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం…

రుద్రాక్షలను ధరించనపుడు ఈ నియమాలు తూచ తప్పకుండా పాటించాలని శాస్త్రములు గోషిస్తున్నాయి.

  1. మద్యాన్ని, మాంసాహారాన్ని తీసుకునే సమయంలో రుద్రాక్షలను ధరించకూడదు.
  2. సూదకం (మైలు)లో ఉన్నప్పుడు రుద్రాక్షలను ధరించకూడదు.
  3. గ్రహణాలు, పురుడు వంటి సమయాలలో ధరించకూడదు. మరల వాటిని తిరిగి ధరించేటప్పుడు వాటిని తప్పనిసరిగా శుద్ధి చేయాలి.
  4. నిద్రించేటప్పుడు, సంభోగ సమయంలో అలాగే కాలకృత్యాల సమయంలో రుద్రాక్షలు ధరించకూడదు.
  5. రుద్రాక్షలను ధరించి ఉన్న సమయంలో అసత్యానికి దూరంగా ఉండాలి. లేకుంటే ఆ పాపం రెట్టింపవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

స్త్రీలు రుద్రాక్షలను ధరించవచ్చా అన్న సందేహాన్ని చూసినట్లయితే,
వేదాలను, ప్రాచీన శాస్త్రాలను చదివి అత్యున్నత జ్ఞానాన్ని కలిగిన కొందరు మహానుభావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే, స్త్రీలు రుద్రాక్షధారణ నిషిద్ధం కాదు. యవ్వనంలో ఉన్న స్త్రీలను మినహాయిస్తే, మిగిలిన వారందరూ అంటే యాభై పైబడిన స్త్రీలందరూ రుద్రాక్షలు ధరించవచ్చన్న విషయాన్ని అనేక పురాణాలు కూడా చెబుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles