సమంత తో విడాకులు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నాగ చైతన్య

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత కొంత మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా సమంత మరియు నాగ చైతన్య జంట ఉంటారు, ఏ మాయ చేసావే సినిమాతో ఒక్కరికిఒక్కరు బాగా దగ్గర అయినా ఈ జంట ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు, ఎలాంటి గొడవలు లేఉకుండా ఎంతో అన్యోయంగా సాగిపోతుంది అనుకుంటున్న వీళ్లిద్దరి దాంపత్య జీవితం లో ఇటీవల కాలం లో కొన్ని మనస్పర్థలు ఏర్పడి విడాకులు తీసుకోవచాల్సి వచ్చింది, వాస్తవానికి వీళ్లిద్దరి విడాకుల వార్త ఎంతో కాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉన్నింది,మేడ్ ఫార్ ఈచ్ అథెర్ లాగ ఉండే ఈ జంట వీడిపోయింది అంటే ఎవ్వరు నమ్మలేకపొయ్యారు, కానీ మేము నిజంగానే విడిపోయాము అంటూ ఇటీవల ఈ జంట అధికారికంగా ప్రకటించడం తో యావత్తు సినీ అభిమానులు శోకసంద్రం లో మునిగిపోయారు, ఎందుకంటే ఈ జంట విడిపోతుంది అని కలలో కూడా ఎవ్వరు ఊహించలేదు,ఇక వీళ్లిద్దరు విడిపోయిన తర్వాత సోషల్ మీడియా లో రోజుకి ఒక్క వార్త ప్రచారం అవుతూ వీళ్లిద్దరికీ కోపం రప్పించేలా చేసాయి, ఇక సమంత అయితే తన పై సోషల్ మీడియా లో చేస్తున్న అసత్య ప్రచారాలకు అసహనం కోల్పోయి కొన్ని యూట్యూబ్ చానెల్స్ మీద కేసు కూడా వేసింది.

ఇది ఇలా ఉండగా తొలిసారి అక్కినేని నాగ చైతన్య తన విడాకులు గురించి ఇటీవల ఇచిన ఒక్క ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు, ఆయన మాట్లాడుతూ ‘ మేము సెలబ్రిటీస్ కాబట్టి ఏ చిన్న విషయం జరిగిన మా గురించి బయట పలు రకాలుగా అనుకోవడం సర్వ సాధారణం,వాటి అన్నిటిని పట్టించుకుంటూ పోతే ఏ పని కూడా చేయలేము,వాళ్లకి మా పేరు వాడుకొని డబ్బులు సంపాదించుకోవడం వ్యాపారం, చేసుకోండి మేము అసలు పట్టించుకోము, నాకు మరియు సమంత కి ఇప్పటి మంచి స్నేహం ఉంది, జీవితాంతం ఆ స్నేహం ఉంటుంది,కలిసి జీవించలేనప్పుడు విడిపోవడమే మంచిది, మేము ఇప్పుడు అదే పని చేసాము, ప్రస్తుతం నా ద్యాస అంత నా సినీ కెరీర్ పైనే ఉంది,తాను కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంది , తనకి లైఫ్ లో అంత మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను’ అంటూ నాగ చైతన్య మాట్లాడాడు.

ఇక నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి కెరీర్ ని వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఇటీవలే నాగ చైతన్య హీరో గా నటించిన లవ్ స్టోరీ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,విడుదల కి ముందు నుండే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలకు మించి విజయం సాధించి నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఒక్క హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లోను మరియు మనం చిత్రం దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు,ఇక సమంత కేవలం హీరోయిన్ పాత్రలకి మాత్రమే పరిమితం కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ముందుకు పోతోంది, ఇటీవల ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఆమె చేసిన నెగటివ్ క్యారక్టర్ కి ఎలాంటి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,భవిష్యత్తు లో కూడా ఆమె అలాంటి క్యారెక్టర్స్ చెయ్యటానికే మొగ్గు చూపుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles