సమంత మరియు నాగ చైతన్య విడాకుల ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన అక్కినేని అమల

టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒక్కరిగా అశేష అభిమానాన్ని సంపాదించుకున్న సమంత మరియు నాగ చైతన్యలు ఇటీవలే విడిపోయాము అని సంచలన ప్రకటన చేఇస్సానప్పటి నుండి సోషల్ మీడియా అటు అభిమానుల నుండి ఇటు సినీ పరిశ్రమ నుండి తీవ్రమైన విచారం వ్యక్తమవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే,అక్కినేని కుటుంబం లో ప్రేమ వివాహాలు ఆచి రావు అని మొదటి నుండి ఇండస్ట్రీ లో ఒక్క టాక్ వినిపిస్తూనే ఉంది, గతం లో అక్కినేని నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్ చెల్లెలు దగ్గుపాటి లక్ష్మి కి పెళ్లి జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరికీ పుట్టిన సంతానమే నాగ చైతన్య, అయితే పెళ్లి అయినా కొన్నాళ్లకే వీల్లిదటి కొన్ని కారణాల వాళ్ళ విడిపోవాల్సి వచ్చింది, ఇక అదే బాట లో అక్కినేని సుమంత్ మరియు కీర్తి రెడ్డి జంట కూడా విడిపోయింది, ఇక ఆ తర్వాత అక్కినేని అఖిల్ మరియు శ్రేయ భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది, వీరెందరి బాట లో నాగ చైతన్య మరియు సమంత జంటలు వెళ్ళదు అనే గట్టి నమ్మకం అభిమానుల్లో ఉండేది, కానీ అభిమానుల అంచనాలు తల క్రిందలు చేస్తూ వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడం మింగుడు పడని విషయం.

ఇక సమంత తో అక్కినేని నాగార్జున మరియు అక్కినేని అమల కి ఉన్న సాన్నిహిత్యం మాటల్లో చెప్పలేనిది, వీళ్లిద్దరు కూడా సమంత ని తమ కోడలు గా చూడడం కంటే సొంత కూతురు లాగ చూసుకున్నారు, సమంత కి కూడా వీళ్లిద్దరు అంటే ఎంతో అభిమానం, నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత కూడా నాగార్జున పుట్టిన రోజు నాడు ఎంతో గొప్పగా ఆయనని పొగుడుతూ హ్యాపీ బర్త్ డే మావయ్య అంటూ ఒక్క ట్వీట్ వేసింది,అక్కినేని అమల కూడా సమంత గురించి కొన్ని ఇంటర్వూస్ లో ఎంతో గొప్పగా మాట్లాడింది, తమకి సమంత లాంటి కోడలు దొరకడం అదృష్టం అనే స్థాయిలో ఆమె ఎన్నో సార్లు చెప్పింది,ఇక నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని నాగార్జున బరువెక్కిన హృదయం తో ఎంతో బాధ పడుతూ ట్విట్టర్ లో ఒక్క ట్వీట్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే ‘సమంత తో మా ఫామిలీ పంచుకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది, తన తో గడిపిన ఆ మధుర క్షణాలను మేము ఎప్పటికి మర్చిపోము, సమంత మరియు చైతన్యల మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటన కి నేను ఎంతగానో విచారిస్తున్నాను, సమంత ఎక్కడ ఉన్న సుఖంగా మరియు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నాను ‘ అంటూ నాగార్జున ఒక్క ట్వీట్ వేసాడు, ఈ ట్వీట్ కి అమల కూడా విచారం వ్యక్తం చేస్తూ ఇలా జరగకుండా ఉండాల్సింది అంటూ తన బాధ ని వ్యక్తపరిచింది.

ఇక విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య తన కెరీర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది, ఇటీవలే నాగ చైతన్య మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే విడుదల అయినా అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, విడుదలకి ముందే బ్లాక్ బస్టర్ సాంగ్స్ వాళ్ళ ఎంతో హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా సరికొత్త రికార్డు నెలకొల్పింది,ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ఒక్క హర్రర్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు, ఇక తమ ఫామిలీ కి మనం వాకాటి సెన్సషనల్ హిట్ ని ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో కలిసి థాంక్యూ అనే సినిమా లో నటిస్తున్నాడు, ఇక సమంత విడాకులు తర్వాత తన బేస్ ని మొత్తం ముంబై కి షిఫ్ట్ చెయ్యబోతున్నట్టు సమాచారం, ప్రస్తుతం ఆమె గుండా శేఖర్ తో శాకుంతలం అనే సినిమాలో నటిస్తుంది, ఈ సినిమా తో పాటు తమిళ్ లో విజయ్ సేతు పతి తో కలిసి ఒక్క సినిమాలో నటిస్తుంది, కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నటన కి ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చెయ్యడానికి సమంత ఇప్పుడు ఆసక్తి చూపుతుంది, మరి విడాకులు తర్వాత వీళ్లిద్దరి సినీ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles