సముద్ర గర్భంలో అంతుచిక్కని రహస్యాలు

విశ్వంలో ఏ గ్ర‌హానికి లేని ప్ర‌త్యేక‌త‌లు భూమికి ఉన్నాయి. భూమ్మీద ఉన్న అద్భుతాలు మ‌రే గ్ర‌హం మీద లేవు. ఇక్క‌డ సుమారు 75 శాతం నీరు ఉంది. ఏడు మ‌హాస‌ముద్రాలున్నాయి. సూర్య‌ర‌శ్మి స‌ముద్రంలోకి కేవ‌లం 350 ఫీట్ల‌లోతులోకి మాత్ర‌మే వెళ్ల‌గ‌లుగుతుంది. ఆ త‌ర్వాత మొత్తం చీక‌టిగా ఉంటుంది. ఈ చీక‌టిలోనే ఎన్నో ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయి. వాటిని క‌నిపెట్టేందుకు ప‌రిశోధ‌కులు నిత్యం ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. వారి ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైన అద్భుతాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం!

1.యోనాగుని క‌ట్ట‌డం

యోనాగుని క‌ట్ట‌డం అనేది స‌ముద్ర‌గ‌ర్భంలో క‌నుగొన్న ఓ అద్భుతం. 1987లో కొంత మంది ప‌రిశోధ‌కులు జ‌పాన్‌లో క‌నిపెట్టారు. చూడ్డానికి ఇది పిర‌మిడ్ ఆకారంలో ఉంటుంది. సుమారు 25 మీట‌ర్ల హైట్‌లో ఉంటుంది. అయితే ఇది ఎలా ఏర్ప‌డింది అనే అంశంపై ప‌లు విభిన్న అభిప్రాయాలున్నాయి. కొంద‌రు మ‌నుషులు త‌యారు చేశార‌ని చెప్తే.. మ‌రికొంద‌రు మాత్రం దానంతట అదే ఏర్ప‌డింద‌ని చెప్తున్నారు. ఆర్కియాల‌జిస్టులు మాత్రం ఇది సుమారు ఐదు వేల ఏండ్ల క్రిత‌మే స‌హ‌జంగా ఏర్ప‌డింద‌ని తేల్చారు.

2.లాస్ట్ న‌గ‌రం

గ్రీక్ ఐలాండ్ జాకిన్ లో ఓ సిటీ బ‌య‌ట‌ప‌డింది. అయితే ఈ సిటీ మాన‌వులు రూపొందించింది కాద‌ని శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు. దీన్ని మైక్రోబ్స్ ఏర్పాటు చేశాయ‌ని తెలిపారు. సుముద్ర గ‌ర్భంలో ఉన్న‌మీథేన్ ఒక్క‌సారిగా విడుద‌ల కావ‌డంతో అక్క‌డి మైక్రోబ్స్ దాన్ని ఫుడ్‌గా తీసుకున్నాయి. అవి కార్బ‌న్‌లాంటి ప‌దార్థాన్ని విస‌ర్జించాయి. అది కాంక్రీట్‌లా గ‌ట్టిప‌డి ఈ నిర్మానం ఏర్ప‌డిన‌ట్లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నిర్మాణాలు కొన్ని ల‌క్ష‌ల ఏండ్ల కింద‌టే ఏర్ప‌డ్డాయ‌న్నారు.

  1. అపోలో-11

జూలై 16, 1969లో నాసా ఈ మిష‌న్‌ను ప్ర‌యోగించింది. దీని ద్వారానే నీల్ ఆర్మ్‌స్టాంగ్ చంద్రుడిపై కాలుమోపాడు. ఈ ప్ర‌యోగం కోసం శాట్రాన్ వీ అనే రాకెట్‌ను ప్ర‌యోగించారు. దీనికి 5 ఇంజిన్లు ఉంటాయి. ఇవ‌న్నీ రాకెట్ పైకెళ్లాక అట్లాంటిక్ సముద్రంలో ప‌డిపోతాయి. అనంతం వాటిని అంద‌రూ మ‌ర్చిపోయారు. కానీ అమెజాన్ సీఈవో బెస్ జోసెఫ్ ఎలాగైనా వాటిని బ‌య‌ట‌కు తీయాల‌నుకున్నాడు. బ్లూ ఆరిజిన్ అనే పేరుతో స్పెస్ టాక్సీని త‌యారు చేసి ప్ర‌జ‌ల‌ను స్పేస్‌లోకి పంపించాల‌నుకున్నాడు. ఇందుకోసం ఓ టీమ్‌ను త‌యారు చేశాడు. వాల్లంతా క‌లిసి స‌ముద్రంలో మునిగిన రెండు ఇంజిన్ల‌ను బ‌యట‌‌కు తీసింది.

  1. టెంపుల్ గార్డెన్

ఇండోనేషియాలోని బాలి స‌ముద్ర‌గ‌ర్భంలో ఓ పురాత‌న ఆల‌యం ఉంది. ఈ ఆల‌యం కొన్ని వేల సంవ‌త్స‌రాల క్రిత‌మే స‌ముద్ర‌ గ‌ర్భంలో క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. ఈ హిందూ దేవాల‌యం తొలుత భూమ్మీదే నిర్మించార‌ని.. ఆ త‌ర్వాత స‌ముద్ర‌మ‌ట్టం పెరిగి నీటిలో మునిగిన‌ట్లు ప‌రిశోధ‌కులు తేల్చారు. ఈ ఆల‌యంలో వినాయ‌కుడు, విష్ణుమూర్తి, ల‌క్ష్మీదేవి విగ్ర‌హాలు అనేకం ఉన్నాయి. 2010లో ఈ ఆల‌యాన్ని పున‌ర్నిర్మించారు. అప్ప‌టి నుంచి ఈ ఆల‌యాన్ని చూసేందుకు ఎంతోమంది టూరిస్టులు ఇండోనేషియాకు వ‌స్తున్నారు.

  1. శాన్‌జోస్లో

కొలంబియాలోని కార్కాజినా కోస్ట్ లో శాన్ జోస్ అనే యుద్ధనౌక ప్ర‌మాదానికి గురైంది‌. ఇంగ్లండ్‌కు, స్పెయిన్‌కు మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ నౌక‌లో మంట‌లు చెల‌రేగి.. ముగినిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 600 మంది చ‌నిపోయారు. అంతేకాదు.. ఈ షిఫ్ లో ఎంతో విలువైన బంగారం, వెండి వ‌స్తువులున్నాయి.2015లో కొలంబియా అధికారులు దీన్ని గుర్తించారు. సుమారు 20 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన నిధి ఉన్న‌ట్లు తేలింది. ఈ నిధి సుమారు 300 ఏండ్లు స‌ముద్ర‌గ‌ర్భంలోనే ఉండిపోవ‌డం విశేషం.

6.బాల్టిక్ సీ అనామ‌లి

2011లో దీన్ని క‌నుగొన్నారు. బాల్టిక్ స‌ముద్రంలో 90 మీట‌ర్ల లోతులో ఇది ఉంది. 60 మీట‌ర్ల మంద క‌లిగి గుండ్టి ఆకారం క‌లిగి ఉంది. దీనికి మెట్లు కూడా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ప్ర‌యోగాలు జ‌రిగినా ఏంట‌ద‌ని ఎవ‌రూ చెప్ప‌లేక‌పోయారు.

  1. క్రాప్ స‌ర్కిల్స్

జ‌పాన్ స‌ముద్ర‌గ‌ర్భంలో 1995లో క్రాప్ స‌ర్కిల్స్ ను స్కూబా డైవ‌ర్లు క‌నుగొన్నారు. ఇసుక‌పై ఉన్న గుండ్ర‌టి ఆకారాన్ని వీళ్లు గుర్తించారు. ఇసుక‌లో ఓ గుండ్ర‌టి ఆకారంలో ఎవ‌రో త‌యారు చేసిన‌ట్లు ఉన్నది. ఓ చేప త‌న గుడ్ల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు ఇలాంటి ఏర్పాటు చేసిన‌ట్లు అనంత‌రం ప‌రిశోధ‌కులు గుర్తించారు.

  1. హైడ్రో థ‌‌ర్మ‌ల్ వెంట్స్

ఈస్ట్ర‌న్ ప‌సిఫిక్ స‌ముద్రంలో ఓ చోట ఉష్ణోగ్ర‌త పెర‌గ‌డాన్ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఆ ఉష్ణోగ్ర‌త తీవ్ర‌త 400 సెంటీగ్రేడ్ వ‌ర‌కు పెర‌గ‌డాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. దీనికి కార‌ణం హైడ్రో థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ వెంట్స్ గా గుర్తించారు. స‌ముద్ర‌గ‌ర్భంలోని అగ్ని ప‌ర్వ‌తాలు విస్పోట‌నం చెంద‌డం వ‌ల్ల వీటి ద్వారా ర‌సాయ‌నాలు వెలువ‌డి హైడ్రో థ‌‌ర్మ‌ల్ వెంట్స్ ద్వారా స‌ముద్రంలో క‌లుస్తాయి. ఈ స‌మయంలో వేడి అత్య‌ధికంగా పెరుగుతుంది.

  1. ల‌య‌న్ సిటీ

ఇది చైనాలోని షిజియాంగ్ ఈ స్ట్ర‌న్ ప్రావిన్స్‌లో ఇది ఉంది. 1959లో చైనా ప్ర‌భుత్వం ఓ హైడ్రాలిక్ విద్యుత్ కేంద్రాన్ని త‌యారు చేయాల‌ని భావించింది. దీంతో మాన‌వ‌నిర్మిత స‌ర‌స్సును త‌యారు చేసింది. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన వ‌ర‌ద‌ల్లో ఈ సిటీ పూర్తిగా మ‌నిగిపోయింది. 150 గ్రామాలు నీట మునిగాయి. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది స‌ర్కారు. ప్ర‌స్తుతం ఈ ల‌య‌న్ సిటీ 130 అడుగుల స‌ముద్రం లోతులో ఉంది.

  1. స్టోన్ హెజ్

భూమ్మీద మిస్టీరియ‌స్ ప్ర‌దేశాల్లో స్టోన్ హెజ్ ఒక‌టి. స‌ముద్ర‌గ‌ర్భంలోనూ ఇలాంటి మ‌రొక‌టి ఉంది. 2007లో మిచిగ‌న్ స‌ర‌స్సులో 40 అడుగుల కింద పిల్ల‌ర్స్‌ను క‌నుగొన్నారు. అవి స్టోన్ హెజ్ లాగే క‌నిపిస్తాయి. స‌ముద్ర గ‌ర్భంలో సుమారు 10 వేల ఏండ్ల క్రిత‌మే ఏర్ప‌డిన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. అయితే ఇది ఎలా ఏర్ప‌డింది అనేది ఇప్ప‌టికీ ఓ ర‌హ‌స్యంగానే ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles