సాలగ్రామాలు అంటే ఏంటో తెలుసా?

సాలగ్రామాలు ఎంతటి శక్తివంతమైనవి? ఎంతటి మహిమలు కలిగినవి? పగిలిన సాలగ్రామాలు పూజకు పనికి వస్తాయా? సాలాగ్రామానికి తులసి దళాలతోనేఎందుకు పూజిస్తారు? సాల అంటే – గ్రామం, దేవాలయం, ఆలయం. గ్రామం అంటే – నివాసం. సాలగ్రామం అంటే అనేక ఆలయాల సమూహం. అంటే మన ఇంట్లో సాలగ్రామం ఉంటే సకల దేవతలు ఉన్నట్టే. వాటికి ప్రతిరోజూ షాడోపచార పూజ చేయాలి. నిత్యాభిషేకం కూడా తప్పనిసరి. ప్రతి సాలగ్రామాన్ని అందరు ఆరాదించకూడదు. వారి నక్షత్రాన్ని, జన్మరాశిని, జాతకాన్ని బట్టి వారికి ఏ సాలగ్రామం అనువుగా ఉంటే ఆ సాలగ్రామాన్ని మాత్రమే పూజించాలి.

అసలు సాలగ్రామం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. సాలగ్రామం అనేది ఒక రాయి. ఇది ఒక జలచరం వలన తయారవుతుంది. ఆ జలచరం కొన్ని వేల యేళ్ళకు మాత్రమే రాయిగా రూపొందుతుందని కొన్నిపురాణాలు చెబుతున్నాయి. సాలగ్రామం ఎన్ని యేళ్లు గడిచినా వాటి రూపం మారకుండా యాధాతదంగా ఉంటాయని రుజువైంది. ఈ సాలగ్రామాలు చాలాఅరుదైనవి. ఇవి ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీ నది తీరంలోని ముక్తినాథ్ క్షేత్రంలో మాత్రమే దొరుకుతాయి. మరెక్కడా దొరకవు. సాలగ్రామం ఎంతఎక్కువ కాలం గడిస్తే అంత మహత్తరమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఎంత చిన్నదైతే అంత శక్తివంతమైనది. కాలం గడిచే కొలది వాటికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఎలాంటి సాలగ్రామాలను పూజిస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటే, ఎరుపు సాలగ్రామాన్ని పూజిస్తే – ఉన్నతమైన పదివి పొందవచ్చు. తెలుపు సాలగ్రామాన్ని పూజిస్తే – అవసరాలను తీరుస్తుంది. పసుపు సాలగ్రామాన్ని పూజిస్తే – అపరసంపదలను పొందవచ్చు. బూడిదరంగు సాలగ్రామాన్ని పూజిస్తే – ధనంతో పాటు పేరు ప్రఖ్యాతలు సిద్ధిస్తాయి. ముదురురంగు సాలగ్రామాన్ని ఎట్టిపరిస్థితిలోనూ ఇంట్లో పూజించరాదని పురాణాలు చెబుతున్నాయి. సర్వశాస్త్రాలూ, ధర్మాలలో చెప్పిన ప్రకారం యజ్ఞాలు, యాగాలు, మంత్ర పూజల కన్నా మహోన్నతమైనది సాలగ్రామపూజ.

ఈ సాలగ్రామాలని కొనరాదు, సాలగ్రామములకి మించిన దానం మరేది లేదు. పూర్వం ఇంటికో సాలగ్రామాన్ని రక్షణగా పెట్టుకునేవారు. తిరుమలలోని, శ్రీరంగంలోను, భద్రాద్రి రామునికి సాలగ్రామాలనే ధరింపచేసి పూజిస్తారు.

వాటి శక్తులను గనుక చూసినట్లయితే, సాలగ్రామ శిలపై పూజించిన కుంకుమను గాని, చందనము గాని నిత్యం పెట్టుకునే వారు ధన్యజీవులు. మోక్షమునకు అర్హులు. సాలగ్రామ శిలా పూజ తర్వాత అదే ప్రదేశంలో భాగవతము చదివిన భక్తి, ముక్తి, శక్తులతో అనుకున్నది సాధించగలుగుతారు. సాలగ్రామ శిలా పూజా ఫలితం – బదరీనాథ్ దర్శించినంత పుణ్యఫలం. గత జన్మ పాపాల నుంచి విముక్తి. ఈ కలియుగమున భగవంతుడు ఆ శ్రీమహావిష్ణువు మన కిచ్చిన వరం సాలగ్రామం. గృహ సంబంధితదేవతార్చనలో శాల గ్రామ పూజ చేయుట వల్ల అనేక గృహ వాస్తు దోషాలు పోతాయి. తెలిసి తెలియక చేసిన తప్పులూ, దోషాలూ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. పగిలిన సాలగ్రామము సంతానహానిని కలిగిస్తుందని, విరిగినది- బుద్దిని హరిస్తుందని, బాగా లావైనది- ధన నాశానాన్ని, పొట్టిది అసలు పూజకే పనికి రాదనీ పురాణాలు చెబుతున్నాయి. అయితే చక్రంతో ఉన్న సాలగ్రామం పగిలినా, విరిగినా పూజకు పనికి వస్తుంది.

సాలాగ్రామానికి తులసీదళాలతోనే ఎందుకు పూజిస్తారంటే…. సాలగ్రామం మహా విష్ణుస్వరూపం. బృందాదేవి, శ్రీమహావిష్ణువుకు ఇచ్చిన శాపం కారణంగా విష్ణువు సాలగ్రామ శిలగా మారిపోతాడు. తన పాతివ్రత్యం చెడినందుకు దుఃఖిస్తున్న బృందకు, తులసిమొక్కగా పుట్టి స్త్రీల చేత అత్యంత పవిత్రంగా పూజింపబడే విధంగా శ్రీమహావిష్ణువు వరం ఇచ్చాడు. అనగా తులసియే – బృంద. అదేవిధంగా బృంద – లక్షిదేవి అంశ. కనుక విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని లక్ష్మి అంశ అయిన తులసితోనే  పూజిస్తారు. పూజించాలి కూడా అని అనేక పురాణాలు చెబుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles