సినిమా పుట్టిన రోజు సందర్భంగా.. తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద మూవీ ఇంటరెస్టింగ్ ఫాక్ట్స్

ఈ యాంత్రిక జీవనంలో అన్ని వయసుల వాల్లూ కాస్త రిలాక్స్ అవడానికి ఉన్న ఒకే ఒక మార్గం సినిమా.తోలు బొమ్మలాట నుంచి మొదలైన వినోద ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విధీనాటకాలు, రంగస్థలం ఇలా పరిణామం చెందుతూ ముకీ చిత్రాల దశను దాటి టాకీ వరకు ఎన్నో సాంకేతకపరమైన పరమైన మార్పులతో ప్రపంచ సినిమా గా విరాజిల్లుతోంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ గురించి తెలుగు కళాకారులు, సాంకేతిక నిపుణుల గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. తెలుగు సినిమా తెరపై మాటల సందడి మొదలై సరిగ్గా ఫిబ్రవరి 6 వ తేదీకి 89ఏళ్లు పూర్తయ్యాయి.
సరిగ్గా ఫిబ్రవరి 6, 1932 న భక్త ప్రహ్లాద తొలి తెలుగు టాకీ చిత్రం విడుదలైంది. H.m రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా వినోద ప్రియులకు ఓ సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలుగు సినీ కళామతల్లి పుట్టి 89 వసంతాలు అయిన సందర్భంగా తెలుగు సినీ ప్రేమికులకు,సినీ శ్రామికులకు, సినీ పండితులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద చిత్ర విశేషాలు..

1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తన కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ సినిమాను నిర్మించి విడుదల చేశారు. అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీ చిత్రం అలం అరా, తెలుగు లో భక్త ప్రహ్లాద, తమిళ లో కాళిదాస ఇలా మూడు భాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారథి హెచ్.ఎమ్.రెడ్డి. సురభి నాటక సమాజం వారి భహుల జనాదరణ పొందిన నాటకం ఆధారంగా నిర్మించబడిన భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది. తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సినిమా 1932 జనవరి 22న సెన్సార్ జరుపుకొని, 1932 ఫిబ్రవరి 6న బొoబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ లో విడుదలైంది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో విడుదలైంది.

తొలి తెలుగు టాకీ సినిమా పురుడు పోసుకొని 89 సంవత్సరాలు అయ్యింది….! అమరుడు హెచ్ .యం.రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన ” భక్త ప్రహ్లాద ” మన తొలి తెలుగు చిత్రం…! భారత్ మూవీ టోన్ పేరిట శ్రీకృష్ణా ఫిల్మ్ కంపెనీ వారు యీ చిత్రాన్ని నిర్మించారు….!

18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో, అంతా మన తెలుగు నటీనటులతో, బొంబాయి లో చిత్రీకరణ జరుపుకొని, బొంబాయి లోనే సెన్సారింగ్ జరుపుకుని బొంబాయి లోని కృష్ణా సినిమా ధియేటర్ లో 1932 ఫిబ్రవరి 6 న యీ చిత్రం విడుదలయి , ఆ తర్వాత విజయవాడ, రాజమండ్రి తదితర కేంద్రాలలో విడుదలయింది….! అది పది రీళ్ల సినిమా… నిడివి పరంగా చెప్పాలంటే 9,628 అడుగుల సినిమా …! అలా 89 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న మన తెలుగు సినిమా యింకో 11 ఏళ్లలో వందేళ్ల మైలు రాయిని చేరుకోబోతుంది….! ఈ నేపధ్యాన్ని పురస్కరించుకొని యీనెల 6 వ తేదీన ఏటా తెలుగు సినిమా తల్లి పుట్టిన రోజు పండగ జరుపుతున్నారు తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలు. తెలుగు సినిమా పరిశ్రమలో చిర స్తాయిగా నిలిచిన భక్త ప్రహ్లాద చిత్రం వెనుక ఎన్నో ఆశక్తికర విశేషాలున్నాయి. ఆ రోజుల్లో ప్రముఖ రచయిత ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన “భక్త ప్రహ్లాద” నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. సినిమాలో ప్రధానపాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను కృష్ణాజిరావు సింధే ధరించారు. ఇంద్రునిగా దొరస్వామినాయుడు, బ్రహ్మగానూ, చండామార్కుల్లో ఒకనిగానూ చిత్రపు నరసింహారావు నటించారు. ప్రహ్లాదుని సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా తర్వాత కాలంలో దర్శకునిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఎల్.వి.ప్రసాద్ గారు నటించారు. ఎల్.వి.ప్రసాద్ గారు మొట్టమొదటి తమిళ టాకీ చిత్రం కాళిదాసులో కూడా నటించడం విశేషం.

1929 లో మనదేశం తొలి టాకీ చిత్రాన్ని చూసింది. అది యూనివర్సల్ వారి ‘ది మెలోడీ ఆఫ్ లవ్’ అది విపరీతంగా ఆకర్షించడంతో, అంతవరకూ మూకీ చిత్రాల తో నెట్టుకొస్తున్న టైమ్ లో భారతీయ చిత్ర నిర్మాతలు తామూ శబ్ద చిత్రాలు తియ్యాలని ఉత్సాహ పడ్డారు. ‘ఆలంఆరా’ తిసిన “ఆర్దేషిర్ ఇరానీ” యే తెలుగు ‘భక్త ప్రహ్లాద’ కూడా తీశారు. అప్పుడు సంగీత దర్శకులు అంటూ లేరు. ఉన్న వరసల్నే, వాడుకున్నారు. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి హార్మొనీ వాయిస్తూ అందరికీ పాట, పద్యం నేర్పారు. ‘భక్త ప్రహ్లాద’ లో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, చాలా చోట్ల మాట వినిపించకపోయినా, ప్రేక్షకులు మాత్రం విరగ బడి చూశారు. ఈ రోజుల లెక్కల్లో అది ఆనాడు ‘సూపర్ డూపర్ హిట్ సినిమా.ఈ చిత్రం బ్లాక్ లో టికెట్స్ కొనుక్కుని చూశారంటే ఈ సినిమా రేంజ్ ఎంటో అంచనా వేయొచ్చు. బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇవాళ్టిది కాదు. ‘భక్త ప్రహ్లాద” సమయంలోనే ఉంది. నాలుగు అణాల టిక్కట్లను, నాలుగు రూపాయలకి ‘ఆలంఆరా’ కి కొన్నట్టే, “భక్త ప్రహ్లాద”కీ కొన్నారు.

తెలుగు సినిమా ప్రత్యేకతలు ఓ సారి చూద్దాం.

1921 లో విడుదలైన తొలి మాటలు లేని చిత్రం భీష్మ ప్రతిజ్ఞ రఘుపతి వెంకయ్య నాయుడు చే రూపొందించిబడింది.ఆయనను తెలుగు సినిమా పితామహుడు అని పిలుస్తారు.

1932 లో h.m రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మొట్ట మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద.

దక్షిణ భారతదేశం లోనే మొట్టమొదటి సినిమా స్టూడియో దుర్గా సినీటోన్ 1936 లో నిడమర్తి సూరయ్య చే రాజమండ్రిలో నిర్మింపబడింది.

1951 లో విడుదలైన మల్లీశ్వరి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొట్టమొదటి తెలుగు చిత్రం. 1953 లో దీనిని చైనీసు సబ్ టైటిళ్ళతో చైనా లోని బీజింగ్లో కూడా 13 ప్రింట్లతో విడుదల చేశారు.

1951 లో నే విడుదలైన పాతాళ భైరవి చిత్రం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా (IFFI) లో ప్రదర్శింపబడ్డ తొలి దక్షిణ భరతదేశపు చిత్రం.

1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఆల్ ఇండియా సర్టిఫికెట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ని పొందిన ఏకైక తెలుగు చిత్రం.

రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నీస్ ప్రపంచ రికార్డులులో నమోదైనద.

హైదరాబాదులో గల ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీన్ కలిగి ఉంది, దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి.

సో..ఇవండీ..తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా భక్త ప్రహ్లాద చిత్రం విశేషాలతో పాటు తెలుగు సినిమా ఆశక్తికర విశేషాలు మిమ్మలను అలరించింది అని అనుకుంటున్నాం. మరో..ఇంటరెస్టింగ్ కంటెంట్ తో మళ్లీ కలుద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles