సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న #RRR రామ్ చరణ్ లీకెడ్ వీడియో

బాహుబలి సినిమా తర్వాత యావత్తు భారత దేశం ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున సినిమా ఆర్ ఆర్ ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి మాస్ హీరోలతో రాజమౌళి లాంటి దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఎవ్వరి ఊహకి అందనంత రేంజ్ కి వెళ్లాయి, ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది, ఈ సినిమా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్ కూడా ఒక్క ముఖ్య పాత్ర లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇక రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరియు ఎన్టీఆర్ కి జోడిగా ఒలీవ మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు, ఇప్పటికే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ టీజర్ల తో పాటి విడుదల అయినా మొదటి పాటకి కూడా ప్రేక్షకులు మరియు అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉండగా కరోనా లాక్ డౌన్ తర్వాత తిరిగి షూటింగ్ ని ప్రారంబించుకున్న ఈ చిత్రం సుమారు 60 రోజుల జరిగిన ఒక్క భారీ షెడ్యూల్ థియో చిత్రీకరణ మొత్తం పూర్తియు చేసుకుంది, అంతే కాకుండా ఈ సినిమాలో ఒక్క కీలకమైన ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి అట, ఈ ఫైట్ సీన్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కెరీర్ లో హైలెట్ గా నిలవనుంది అట, ఎముకలు కొరికే చలిలో సుమారు 60 రోజుల పాటు కేవలం రాత్రుల్లో తెరకెక్కించిన ఈ సన్నివేశం అద్భుతంగా వచ్చింది అట, ఇక ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న కీరవాణి ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు రోమాలు నిక్కపొడిచే విధంగా ఉండబోతుంది అట, ఇక రీ రికార్డింగ్ పనులు చకచకా మొదలు పెట్టేసాడు అంట కీరవాణి , వీటి రషెస్ ని ఇటీవలే చూసిన రాజమౌళి కి నోటి నుండి మాట రాలేదు అట, అద్భుతమైన సన్నివేశాలను కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవెల్ కి తీసుకొని పోయినట్టు సమాచారం, మరి ఇన్ని అద్భుతమైన ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం మెగా మరియు నందమూరి అభిమానులను ఏ స్థాయిలో అలరించబోతుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరుకు ఆగాల్సిందే.

అన్ని అనుకున్నట్లు పాకికగా జరిగి ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల కావాల్సి ఉంది, కానీ రాజమౌళి చెక్కుడు గురించి మన అందరికి తెలిసిందే,దానికి తోడు ఈ సినిమాకి అత్యంత కీలమైన అంతర్జాతీయ మర్కెట్స్ ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడం ,ఈ సినిమాకి స్మాబ్ద్నించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ బోలెడంత మిగిలి ఉండడం తో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యడమే బెటర్ నాయి మూవీ యూనిట్ ఫిక్స్ అయ్యింది,ఒక్కవేల మధ్యలో కరోనా మహమ్మారి బీబత్సం సృష్టించి ఉండకపోయాయి ఉంటె ఈ సినిమా ఎప్పుడో విడుదల అయిపొయ్యి ఉండేది,ఇక ఈ సినిమా షూటింగ్ ఊర్తి అవ్వడం తో హీరోలిద్దరు తమ తదుపరి సినిమాలపై ద్రుష్టి సారించారు, ఇప్పటికే రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక్క సినిమా కమిట్ అయ్యి షూటింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించేసాడు, ఇక జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ దర్శకత్వం లో ఒక్క సినిమా చేయనున్నాడు, ఈ సినిమా తర్వాత అయన ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా ఎప్పుడో కమిట్ అయిపొయ్యి ఉన్నాడు, ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఈ ఇద్దరి హీరోలలో ఎవరికీ పాన్ ఇండియన్ మార్కెట్ బాగా వస్తుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles