స్టేజి మీద అందరూ చూస్తుండగానే శ్రీకాంత్ కొడుకుకి వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో మెగాస్టార్ చిరంజీవి ప్రపంచ వ్యాప్తంగా సినీ హీరో గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడా ఆయనని తన తోటి నటీనటులు ఎంతగానో అభిమానుస్తూ ఉంటారు, చిరంజీవి ప్రస్తావన వస్తే వాళ్ళు కూడా ఒక్క సెలబ్రిటీ అనే విషయం ని మర్చిపొయ్యి సాధారణ అభిమాని లాగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇండస్ట్రీ లో ఉండే అందరూ అన్నయ్య అని ఎంతో ప్రేమగా పిలుచుకునే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి, చిరంజీవి గారిని విపరీతంగా అభిమానించే హీరోలలో ఒక్కరు శ్రీకాంత్, ఈయనకి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,చిరంజీవి గారిని తన సొంత అన్నయ్య లాగ ఈయన భావిస్తూ ఉంటాడు, చిరంజీవి కూడా నాకు ఇద్దరు తమ్ముళ్లు కాదు, ముగ్గురు తమ్ములు, పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు లతో పాటు శ్రీకాంత్ కూడా నా తమ్ముడే అని చిరంజీవి ఎన్నో సందర్బాలలో బహిరంగంగానే తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది.

ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రాఘవేంద్ర రావు గారి దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన పెళ్లి సందడి అనే చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సంగతి మన ఎందరికి తెలిసిందే, ఈ ఈవెంట్ కి మూయ అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ లు హాజరు అయ్యారు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, శ్రీకాంత్ కొడుకు అంతకుముందు చిరంజీవి గారు అని సంబోధిస్తూ ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడాడు,దానికి చిరంజీవి సమాధానం చెప్తూ ‘ వీడికి ఎంత ధైర్యం, నన్నే పేరు పెట్టి పిలుస్తాడా, ఇలాగేనా పెంచేది పిల్లల్ని’ అంటూ అక్కడికి వచ్చి ఊహ గారిని అడిగారు చిరంజీవి, ఆ తర్వాత తన ప్రసంగం ని కొనసాగిస్తూ ‘రోషన్ ఎప్పుడు నన్ను పెద్దనాన్న అని పిలిచేవాడు, కానీ ఇక్కడ పరాయి మనిషి లాగ చిరంజీవి గారు అని పిలుస్తున్నాడు’ అంటూ సరదాగా మాట్లాడాడు చిరంజీవి, దానికి రోషన్ మాట్లాడుతూ ‘ ఇంతమంది ముందు అలా పిలిస్తే బాగోదు అని , చిరంజీవి గారు అన్నాను ‘ అని అనగా , దానికి చిరంజీవి బదులు ఇస్తూ ‘ ఇక్కడే కాదు ఎక్కడైనా నేను మీ నాన్న కి అన్నాయనే రా నువ్వు ఎక్కడైనా నన్ను పెదనాన్న అని పిలవచ్చు’ అంటూ సమాధానం చెప్పాడు చిరంజీవి.

పాతికేళ్ల క్రితం శ్రీకాంత్ హీరో గా రాఘవేంద్ర రావు గారి దర్శకత్వం లో తెరకెక్కిన పెళ్లి సందడి అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఎన్నో రికార్డులకు కేంద్రబిందువుగా ఈ సినిమా నిలబడడమే కాకుండా,ఒక్క కల్ట్ క్లాసిక్ గా కూడా నిలిచింది, అలాంటి సినిమా పేరు ని పెట్టి అదే దర్శకుడి పర్యవేక్షణ లో తీస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ పై అంచనాలు సాధారణంగానే ఉండడం సహజం,ఆ అంచనాలకు తగ్గట్టు గానే ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు అట, మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ నెల 15 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే,ఇది ఇలా ఉండగా ఇటీవల జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా గెలవగా హీరో శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా బంపర్ మెజారిటీ తో గెలిచినా సంగతి మన అందరికి తెలిసిందే, ప్రకాష్ రాజ్ ప్రెసిడినెట్ గా ఓడిపోయిన , ఆయన సభ్యులు మాత్రం 11 మంది గెలిచి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles