100 కోట్లు కలెక్ట్ చేసిన మన తెలుగు సినిమాలు

ఈ మధ్య కాలం లో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏది హిట్ ఓ ఏది ప్లాప్ ఓ చెప్పడం చాలా కష్టం ఐనపనే, అందుకు కారణం రిలీజ్ ఐన ప్రతి సినిమాకి సక్సెస్ టూర్ చేస్తూ ఉండడమే.. ఒక మాటలో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ తన సినిమాలోని ఒక పాటలో.. విజయ యాత్రలంటూ కాలి థియేటర్లకు వెళ్తూ ఉంటారు, అన్నట్టు ఉంది ప్లాప్ ఐన చిత్రాల పరిస్థి ఇక ప్లాప్ విశ్యాలని పక్కకి పెడితే హిట్ ఐన సినిమాలు కూడా బారి ఎత్తున కలెక్షన్స్ ని రాబట్టడంలో విఫలం అవుతున్నయి, మరి మన టాలీవుడ్ లో సినిమాని హిట్ కొట్టడం తో పాటు 100 కోట్ల కలెక్షన్స్ రబ్బట్టిన సినిమాలు ఎన్ని ఉన్నాయి..? 100 క్లబ్ లో చేరిన హీరోలు ఎవరు, అనే విషయాలని తెలుసుకుందాం..

టాలీవుడ్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ప్రస్తావన వస్తే మనం ముందుగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, మిగితా హీరోలతో కంపేర్ చేస్తే 100 కోట్ల క్లబ్ లో మహేష్ బాబు గారివే ఎక్కువ సినిమాలు ఉన్నాయ్, సూపర్ స్టార్ కెరీర్ లో ఏకంగా ఐదు 100 కోట్లు కల్లెక్ట్ చేసిన సినిమాలు ఉండడం విశేషం, 2011 లో విడుదల ఐన దూకుడు సినిమాతో 100 క్లబ్ లో చేరాడు మహేష్ బాబు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దెగ్గర 101 కోట్లు కల్లెక్ట్ చేసింది, ఆ తర్వాత 2015 లో వచ్చిన శ్రీమంతుడు సినిమా తో 144 కోట్లు, 2018 లో వచ్చిన భారత్ అనే నేను సినిమా తో 160 కోట్లు, 2019 లో వచ్చిన మహర్షి తో 168 కోట్లు, 2020 లో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా తో 206 కొల్లకొట్టి, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వంద కోట్లు కల్లెక్ట్ చేసిన సినిమాలు ఉన్న హీరో గా రికార్డు సాధించాడు..

ఇక మహేష్ బాబు గారి తర్వాత చెప్పుకోవాల్సిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఈ హీరో కాతాలో 4 వంద కోట్ల కల్లెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయ్.. 2014 లో విడుదల ఐన రేస్ గుర్రం సినిమా తో మొదటి 100 కోట్లు కల్లెక్ట్ చేసిన సినిమా తన కాతలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దెగ్గర 107 కోట్లు రాబట్టింది, ఇక ఆ తర్వాత 2016 లో వచ్చిన సరైనోడు సినిమాతో 125 కోట్లు, 2017 లో వచ్చిన దువ్వాడ జగన్నాధం సినిమా తో 115 కోట్లు, 2020 లో వచ్చిన ఆలా వైకుంఠపురం సినిమా తో 263 కోట్లు కల్లెక్ట్ చేసి, నాలుగు 100 కోట్లు కల్లెక్ట్ చేసిన సినిమాలని తన కతాలో వేసుకున్నాడు..

ఇక మన రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో ఒక సంచలనం సృష్టించిన సంగతి మనందరికి తెలిసిందే, అయితే ఈ హీరో కాతాలో మొదటగా 100 కోట్లు కల్లెక్ట్ చేసిన సినిమా బాహుబలి ఏ కావడం విశేషం, బాహుబలి వన్ సినిమాతో 602 కోట్లు కల్లెక్ట్ చేసిన ప్రభాస్ బాహుబలి 2 తో ఏకంగా 1742 కోట్లని బాక్స్ ఆఫీస్ దెగ్గర కొల్లకొటాడు తెలుగు సినిమా చరిత్రలో ఇదే హైయెస్ట్ కావడం వీశేషం.. ఈ రెండు సినిమాల తర్వాత పాన్ ఇండియన్ సినిమా గా విడుదల ఐన సాహి కూడా 408 కోట్లు రాబట్టడంతో ఈ హీరో కాతాలో మూడు 100 సినిమాలు చేరాయి..

ఇక మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాతాలో కూడా మూడు 100 కోట్లు కల్లెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయ్, 2016 లో విడుదల ఐన జనతా గ్యారేజ్ సినిమా తో మొదటి 100 కోట్ల సినిమా ని అందుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా 125 కోట్లు కొల్లకొటాడు, ఆ తర్వాత 2017 లో వచ్చిన జై లవ కుశ తో 124 కోట్లు, 2018 లో వచ్చిన అరవింద సమ్మెత సినిమా తో 159 కోట్లు కల్లెక్ట్ చేసి మూడు వంద కోట్ల సినిమాలని తన కాతాలో వేసుకున్నాడు, ఇక ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న RRR సినిమా ఇప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ అని బాధలు కొడుతుంది అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

ఇక మన మెగాసార్ చిరంజీవి బాస్ is బ్యాక్ అంటూ 2017 లో ఖైదీ no 150 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు, ఈ సినిమా తో చిరంజీవి గారు తన కెరీర్ లో మొట్టమొదటి 100 కోట్లు కల్లెక్ట్ చేసిన సినిమాని తన కాతాలో వేసుకున్నాడు ఆ తర్వాత 2019 బారి అంచనాలతో విడుదల ఐన సై రా నరసింహ రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ దెగ్గర 225 కోట్లు కొల్లకొట్టగా, మొత్తం రెండు 100 కోట్ల సినిమాలని తన కాతలో వేసుకున్నాడు మన మెగా స్టార్..

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏ హీరో కి సాధ్యం కానీ విధంగా తన రెండవ సినిమా తో 100 కోట్ల క్లబ్ లో చేరి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు, 2009 లో విడుదల ఐన మగధీర సినిమా తో 136 కోట్లు కల్లెక్ట్ చేసిన రామ్ చరణ్ ఆ తర్వాత మల్లి 2018 లో అంటే దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత మల్లి రంగస్థలం సినిమా తో 214 కోట్ల కలెక్షన్ రాబట్టాడు..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హిట్లు లేకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో వేరేగా చెప్పక్కర్లేదు, తన కెరీర్ మొత్తం లో ఒకటే 100 కోట్ల సినిమా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చిన అత్తారింటికి దారిదేది సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు పవన్ కళ్యాణ్, ఈ సినిమా తో 131 కోట్లు రాబట్టిన పవర్ స్టార్ మున్ముందు మరిన్ని హిట్ సినిమాలతో మనముందుకు రావాలని కోరుకుందాం..

ఇక అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ ఐన విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమా తో 100 కోట్ల క్లబ్ లో చేరాడు.. ఈ సినిమా ద్వారా 115 కోట్లు కొల్లకొట్టాడు రౌడీ బాయ్ విజయ్ దేవేరుకోండ..

విక్టరీ వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ F2 సినిమా తో 2020 సంక్రాంతికి కానుకగా మనముందు వచ్చారు ఈ సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది, బాక్సాఫీస్ దెగ్గర 135 కోట్లు రాబట్టి తెలుగు సినిమా చరిత్రలో 100 కోట్లు రాబట్టిన మొదటి మల్టీ స్టార్రర్ మూవీ గా నిలిచిపోయింది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles