50 ఏళ్ళ వయసులో పిల్లల్ని కంటున్నా టాలీవుడ్ సెలెబ్రిటీలు..

సినిమా వాళ్ల జీవితాలు అంటే అందరికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది అందుకే వాళ్ల జీవితాల్లో ఎం జరిగిన అది ఒక వైరల్ న్యూస్ గా మారుతుంది, మీడియా ని ఎంతో దూరం పెట్టాలని చుసిన సరే ఏదో ఒక విధంగా ఆ వార్తలు బయటికి వస్తూనే ఉంటాయి.. ఇక ప్రస్తుతం ఉన్న సెలెబ్రటీలు అయితే ఆ వార్తలని పట్టించుకోవడం మానేసి వారి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నారు, అయితే కొంత మంది సెలెబ్రిల లైఫ్ మాత్రం వారు అనుకున్న విధంగా కాకుండా ఎన్నో మలుపులు తిరుగుతుంది ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుకొని పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనస్పర్థల కారణంగా విడిపోవాల్సి వస్తుంది, ఆలా విడిపోయిన వారు కొంతమంది తమ పిల్లల్ని చూసుకుంటూ గడిపేస్తుంటే మరికొంత మంది మాత్రం లేట్ వయసులో పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని కంటున్నారు, ఆలా లేట్ వయసులో పిల్లల్ని కంటున్నా సెలెబ్రిటీలు ఎవ్వరో మనం ఇపుడు తెలుసుకుందాం..

ఈ కోవలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, ఇతడికి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు, ఇతడి సినిమాలు హిట్ ఐన ప్లాప్ ఐన తనకి ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గదు, అది తనకి ఉన్న పవర్, సినిమాల్లో నటిస్తూనే ప్రజలకి సేవ చేయాలి అన్న ఉదేశ్యం తో రాజకీయాల్లోకి కూడా వచ్చి తన వంతు పోరాటం తాను చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ ని గమనించినట్లయితే తాను ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు, మొదటగా నందిని అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు అయితే ఈ విష్యం మీడియా కి కొంచెం లేట్ గానే తెలిసింది.. ఈమెతో విడిపోయిన తర్వాత బద్రి సినిమాలో తనతో నటించిన రేణు దేశాయ్ ని ప్రేమించి కొంత కాలం సహా జీవనం చేసిన తర్వాత తనని పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక బాబు ఒక పాపా..

రేణు దేశాయ్ తో కూడా మనస్పర్థలు రావడం తో 2012 లో తనకి విడాకులు ఇచ్చి 2013 లో తన తీన్మార్ సినిమాలో తన తో పాటు నటించిన అన్న లేజేహనేవ గారిని పెళ్లి చేసుకున్నాడు, వీరిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు, 2013 లో వీరిద్దరికి పెళ్లి ఐన తర్వాత వీరిద్దరికి ఒక పాపా పుట్టగా 2017 మళ్ళీ ఒక బాబు పుట్టాడు, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వయసు 49 ఏళ్ళు.. ఐతే వీరికి పుట్టిన పాపా పేరులో వీరి అమ్మ పేరు వచ్చేలా పోలేన అంజనా పావనోవా అని పెట్టగ కొడుకు పేరు లో తన అన్న చిరంజీవి గారి పేరు వచ్చేలా అదే శివ శంకర్ వరప్రసాద్ పేరు వచ్చేలా మార్క్ శంకర్ పావనోవిచ్ బాబు కి పేరు పెట్టాడు..

ఇక ఈ కోవలో మనం తర్వాత చెప్పుకోవాల్సింది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి, తాను ఏ పాత్ర పోషించిన ఆ పాత్ర తాను పోషించాడు అని అనడం కంటే తాను ఆ పాత్రలో జీవించాడు అని అనుకులే నటిస్తాడు, తన నటనతో మన అందరిని ఆకట్టుకున్న ఈ నటుడి పర్సనల్ జీవితం చూసుకున్నట్లైతే మొదటగా తాను లలిత కుమారి గారిని పెళ్లి చేసుకున్నారు, వీళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు ఉన్నారు, 2004 లో వీళ్ళ అబ్బాయి చనిపోయాక వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు, లలిత కుమారి గారితో విడిపోయాక 2010 లో ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ గారిని పెళ్లి చేసుకున్నాడు, వీరిద్దరికి ఇపుడు 5 ఏళ్ళ బాబు ఉన్నాడు, ప్రస్తుతం ప్రకాష్ రాజ్ గారి వయసు 55 ఏళ్ళు..

శరత్ కుమార్, ఈ పేరు వినగానే చాల మంది గుర్తుపట్టక పోయిన జయ జానకి నాయకి సినిమాలో బెల్లం కొండా సాయి శ్రీనివాస్ తండ్రి అంటే ఎవ్వరైనా టక్కున గుర్తు పడతారు, తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ సౌత్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ఈ నటుడు మొదట 1984 లో ఛాయా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి ఒక పాపా ఒక బాబు ఉన్నారు,ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో వీరిద్దరూ విడిపోయారు ఛాయా గారితో విడిపోయిన తర్వాత 2001 లో రాధికా ని పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు ప్రస్తుతం శరత్ కుమార్ గారి వయసు 66 ఏళ్ళు కాగా వీరిద్దరికి బాబు పుట్టే సమయానికి శరత్ కుమారి వయసు 50 ఏళ్ళు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles