Admin

25 POSTS0 COMMENTS
http://live95times.com

ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కార్స్ కలెక్షన్

ముంబై ఇండియన్స్, ఇప్పటి వరకు ఐపీల్ చరిత్రలో ఎక్కువ సార్లు ట్రోఫీ ని గెలిచిన టీం ఇదే, 2013 , 2015 , 2017 , 2019 , 2020 మొత్తం ఐదు...

శివుడి కంటి నుండి కింద పడ్డ నీటి చుక్కే రుద్రాక్ష గా మారింది అని మీకు తెలుసా ?

రుద్రాక్ష పుట్టుక, దాని మహిమలు? రుద్రాక్షలు ఎన్ని రకాలు, వాటి ఫలితాలు? నిజమైన రుద్రాక్షలను ఎలా కనిపెట్టవచ్చు? రుద్రాక్షలు ఏ సమయంలో ధరించాలి? రుద్రాక్ష ధారణలో పాటించాల్సిన నియమాలు? స్త్రీలు రుద్రాక్షలు ధరించవచ్చా...

హనుమంతుడి వంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుందో తెలుసా..?

ఒంటి నిండా సిందూరం లేని హనుమంతుని విగ్రహాలు ఉండటం చాలా అరుదు. ఆలయాల్లో ఉండే హనుమంతుడి ఒళ్ళంతా సిందూరం ఎందుకు పూస్తారు? ఒకవేళ హనుమంతుడికి సిందూరం అంటే ఇష్టమా అన్న సందేహం రావచ్చు?హనుమంతుని ఒళ్ళంతా సిందూరం ఉండటానికి ఒక ఆదర్శవంతమైన కథ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఒకనాడు హనుమంతుడు శ్రీరాముడిని చూసేందుకై అయోధ్యా నగరానికి వెళ్ళాడు. అక్కడ సిందూరం పెట్టుకుంటున్న సీతమ్మ తల్లిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడట. దీనికి సీతమ్మ తల్లి ఏమిటి హనుమా అలా చూస్తూ ఉండిపోయావు అని అడిగిందట. వెంటనే హనుమంతుడు నెమ్మదిగా సీతమ్మ వద్దకు వెళ్లి తల్లీ నీ నుదుటిన పెట్టుకున్న సిందూర తిలకమునకు అర్థమేమిటి అని అడిగాడట. దానికి సీతమ్మ తల్లి... నేనిలా సిందూరం ధరిస్తే, నా స్వామీ నీ స్వామీ అయిన శ్రీ రాముడి ఆయువు నిత్యమూ పెరుగుతుంది అని సెలవిచ్చిందట. దానికి హనుమంతుడు, సీతమ్మ తల్లి నుదుటిన అంత సిందూరం పెట్టుకుంటేనే స్వామీ ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా స్వామీ పేరు చెప్పు సిందూరాన్ని పూసుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఆలోచించి వెంటనే సిందూరాన్ని తన శరీరానికి రాసుకోవడం ప్రారంబించాడట. కానీ శరీరానికి అంటుకోవడం లేదని గమనించిన హనుమంతుడు దీనికి గల కారణం ఏమై ఉండవచ్చని ఆలోచిస్తే తన ఒంటి నిండా రోమాలు ఉండటమే దానికి గల కారణం అని తెలుసుకున్నాడట. వెంటనే ఆ సిందూరాన్ని నువ్వుల నూనెలో కలిపి మొత్తం ఒంటికి పూసుకుని, శ్రీరాముని వద్దకు వెళ్ళాడట.  హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయిన శ్రీరాముడు ఈ సిందూరం ఏమిటి హనుమా అని అడగగా... హనుమంతుడు ఈ విధంగా సెలవిచ్చాడట. సీతమ్మ తల్లి, మీ ఆయువు పెరగాలని తన నుదుటిన సిందూరం పెట్టుకుంది. నుదుటిన ధరిస్తేనే ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా పూసుకుంటే మీ ఆయువు మరింత పెరుగుతుందని ఇలా చేసాను అన్నాడట హనుమంతుడు. ఈ విషయం విన్న శ్రీరాముడు, ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. దీనితో శ్రీరాముడు- తనపై హనుమంతునికి గల భక్తికి సంతోషించి ఇక నుండి నీకు సిందూరం సమర్పించి ఎవరైతే పూజిస్తారో అటువంటి భక్తుల అన్ని కోరికలనూ నేను తీరుస్తాను అని శ్రీరాముడు వరమిచ్చాడట. కనుక హనుమంతునికి ప్రీతికరమైన మంగళవారం నాడు ఆయనకీ సిందూరం అలంకరంచి పూజించినట్లైతే కోరిన కోరికలన్నీ తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి.   

సంధ్యావందనం గురించి పురాణాల్లో చెప్పబడిన కథ

సంధ్యావందనం చాలా విశిష్టతతో కూడుకున్నది. ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు తప్పనిసరిగా చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సమయంలో)...

మీకు వచ్చే కలల వెనుక నమ్మలేని రహస్యం

మనలో చాలా మందికి కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని శుభఫలితాలను సూచిస్తుంటే మరికొన్ని అశుభాన్ని సూచిస్తుంటాయి. కానీ ఏ కలలు ఏ ఫలితాన్ని సూచిస్తాయో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అందుకే మీకోసం...

18 శక్తి పీఠాల రహస్యం

హిందూ పురాణాల ప్రకారం ఆదిపరాశక్తి అంశాల స్వరూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని ప్రజల ప్రగాఢ నమ్మకం. అయితే ఈ అష్టా దశ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి....

ఆడవారు ధరించే నగల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

ప్రాచీన కాలం నుండి చూస్తున్నట్లైతే స్త్రీలకు అత్యంత ప్రీతికరమైనవి- ఆభరణాలు. పూర్వకాలంలో వారం రోజుల పాటు రోజుకి ఒకటి చొప్పున ఆదివారం- కెంపులు, సోమవారం- ముత్యాలు, మంగళవారం- పగడాలు, బుధవారం- పచ్చలు, గురువారం-...

సాలగ్రామాలు అంటే ఏంటో తెలుసా?

సాలగ్రామాలు ఎంతటి శక్తివంతమైనవి? ఎంతటి మహిమలు కలిగినవి? పగిలిన సాలగ్రామాలు పూజకు పనికి వస్తాయా? సాలాగ్రామానికి తులసి దళాలతోనేఎందుకు పూజిస్తారు? సాల అంటే - గ్రామం, దేవాలయం, ఆలయం. గ్రామం అంటే - నివాసం. సాలగ్రామం అంటే అనేక ఆలయాల సమూహం. అంటే మన ఇంట్లో సాలగ్రామం ఉంటే సకల దేవతలు ఉన్నట్టే. వాటికి ప్రతిరోజూ షాడోపచార పూజ చేయాలి. నిత్యాభిషేకం కూడా తప్పనిసరి. ప్రతి సాలగ్రామాన్ని అందరు ఆరాదించకూడదు. వారి నక్షత్రాన్ని, జన్మరాశిని, జాతకాన్ని బట్టి వారికి ఏ సాలగ్రామం అనువుగా ఉంటే ఆ సాలగ్రామాన్ని మాత్రమే పూజించాలి. అసలు సాలగ్రామం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. సాలగ్రామం అనేది ఒక రాయి. ఇది ఒక జలచరం వలన తయారవుతుంది. ఆ జలచరం కొన్ని వేల యేళ్ళకు మాత్రమే రాయిగా రూపొందుతుందని కొన్నిపురాణాలు చెబుతున్నాయి. సాలగ్రామం ఎన్ని యేళ్లు గడిచినా వాటి రూపం మారకుండా యాధాతదంగా ఉంటాయని రుజువైంది. ఈ సాలగ్రామాలు చాలాఅరుదైనవి. ఇవి ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీ నది తీరంలోని ముక్తినాథ్ క్షేత్రంలో మాత్రమే దొరుకుతాయి. మరెక్కడా దొరకవు. సాలగ్రామం ఎంతఎక్కువ కాలం గడిస్తే అంత మహత్తరమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఎంత చిన్నదైతే అంత శక్తివంతమైనది. కాలం గడిచే కొలది వాటికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయని పురాణాలు చెబుతున్నాయి. ఎలాంటి సాలగ్రామాలను పూజిస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటే, ఎరుపు సాలగ్రామాన్ని పూజిస్తే - ఉన్నతమైన పదివి పొందవచ్చు. తెలుపు సాలగ్రామాన్ని పూజిస్తే - అవసరాలను తీరుస్తుంది. పసుపు సాలగ్రామాన్ని పూజిస్తే - అపరసంపదలను పొందవచ్చు. బూడిదరంగు సాలగ్రామాన్ని పూజిస్తే - ధనంతో పాటు పేరు ప్రఖ్యాతలు సిద్ధిస్తాయి. ముదురురంగు సాలగ్రామాన్ని ఎట్టిపరిస్థితిలోనూ ఇంట్లో పూజించరాదని పురాణాలు చెబుతున్నాయి. సర్వశాస్త్రాలూ, ధర్మాలలో చెప్పిన ప్రకారం యజ్ఞాలు, యాగాలు, మంత్ర పూజల కన్నా మహోన్నతమైనది సాలగ్రామపూజ. ఈ సాలగ్రామాలని కొనరాదు, సాలగ్రామములకి మించిన దానం మరేది లేదు. పూర్వం ఇంటికో సాలగ్రామాన్ని రక్షణగా పెట్టుకునేవారు. తిరుమలలోని, శ్రీరంగంలోను, భద్రాద్రి రామునికి సాలగ్రామాలనే ధరింపచేసి పూజిస్తారు. వాటి శక్తులను గనుక చూసినట్లయితే, సాలగ్రామ శిలపై పూజించిన కుంకుమను గాని, చందనము గాని నిత్యం పెట్టుకునే వారు ధన్యజీవులు. మోక్షమునకు అర్హులు. సాలగ్రామ శిలా పూజ తర్వాత అదే ప్రదేశంలో భాగవతము చదివిన భక్తి, ముక్తి, శక్తులతో అనుకున్నది సాధించగలుగుతారు. సాలగ్రామ శిలా పూజా ఫలితం - బదరీనాథ్ దర్శించినంత పుణ్యఫలం. గత జన్మ పాపాల నుంచి విముక్తి. ఈ కలియుగమున భగవంతుడు ఆ శ్రీమహావిష్ణువు మన కిచ్చిన వరం సాలగ్రామం. గృహ సంబంధితదేవతార్చనలో శాల గ్రామ పూజ చేయుట వల్ల అనేక గృహ వాస్తు దోషాలు పోతాయి. తెలిసి తెలియక చేసిన తప్పులూ, దోషాలూ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. పగిలిన సాలగ్రామము సంతానహానిని కలిగిస్తుందని, విరిగినది- బుద్దిని హరిస్తుందని, బాగా లావైనది- ధన నాశానాన్ని, పొట్టిది అసలు పూజకే పనికి రాదనీ పురాణాలు చెబుతున్నాయి. అయితే చక్రంతో ఉన్న సాలగ్రామం పగిలినా, విరిగినా పూజకు పనికి వస్తుంది. సాలాగ్రామానికి తులసీదళాలతోనే ఎందుకు పూజిస్తారంటే.... సాలగ్రామం మహా విష్ణుస్వరూపం. బృందాదేవి, శ్రీమహావిష్ణువుకు ఇచ్చిన శాపం కారణంగా విష్ణువు సాలగ్రామ శిలగా మారిపోతాడు. తన పాతివ్రత్యం చెడినందుకు దుఃఖిస్తున్న బృందకు, తులసిమొక్కగా పుట్టి స్త్రీల చేత అత్యంత పవిత్రంగా పూజింపబడే విధంగా శ్రీమహావిష్ణువు వరం ఇచ్చాడు. అనగా తులసియే - బృంద. అదేవిధంగా బృంద - లక్షిదేవి అంశ. కనుక విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని లక్ష్మి అంశ అయిన తులసితోనే  పూజిస్తారు. పూజించాలి కూడా అని అనేక పురాణాలు చెబుతున్నాయి.

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles