Home Devotional

Devotional

కోరిన కోర్కెలు తీర్చే తమిళనాడు స్వయంబు వినాయకుడి విశేషాలు

భక్తులు నిండు మనసుతో పూజిస్తే విఘ్నాలు లేకుండా అనుగ్రహించే దేవుడు వినాయకుడు. విగ్నేశ్వరుడు- దీనదయాళుడు. సాధారణంగా దేవాలయాలు భూమిపై ఉంటే ఇక్కడ స్వామి కొండపై ఉండటం విశేషం. ఈ ఆలయం తమిళనాడులోని, తిరుచ్చిలో రాక్ ఫోర్ట్ పై స్వయంబుగా వెలిసాడు. ఈ ఆలయంకొండపై 83 అడుగుల ఎత్తులో ఉంది. స్థల పురాణం: రామాయణంలో రావణుడు సీతను బంధిస్తాడు. దీనిని వ్యతిరేకించిన రావణుడి సోదరుడు, విభీషణుడు తన సోదరుడికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో రాముడికి సహాయం చేస్తాడు. ఈ విషయం మొత్తం తెలుసుకున్న రాముడు, రావణుని సంహరించి చివరికి సీతను పొందుతాడు. విభీషణుడు చేసిన సహాయానికి చిహ్నంగా రాముడు, విష్ణువు యొక్క రూపమైన రంగనాథుని విగ్రహాన్ని ఇస్తాడు. విభీషణుడు, రాముడికి మద్దతు ఇచ్చినప్పటికీ, నిజానికి అతను అసురుడు అవ్వడం చేత దేవతలు, రంగనాధ స్వామి విగ్రహాన్ని లంకకు చేరకుండా అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇందుకోసం దేవతలు వినాయకుడిని ప్రార్ధిస్తారు. స్వామి ప్రత్యక్షమై వారి కోరికలను తీరుస్తానని మాట ఇస్తాడు. విభీషణుడు తిరుచ్చి సమీపంలోని విగ్రహాన్ని తీసుకువెళుతుండగా కావేరి నది కనిపించగా పుణ్యస్నానం చేయాలని భావిస్తాడు. అయితే విగ్రహాన్ని నేలపై పెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుందన్న కారణంతో అక్కడే పశువుల కాపరి రూపంలో ఉన్న వినాయకుడి సాయం కోరతాడు. కొద్ధి సమయం మాత్రమే తాను విగ్రహాన్ని పెట్టుకుంటానని సమయం ముగిసిన తరువాత విగ్రహాన్ని నేలపై పెడతానని బాలుడు చెబుతాడు. దీనంతటినీ అంగీకరించిన విభీషణుడు ఆ విగ్రహాన్ని ఆ బాలుడి చేతికి ఇస్తాడు. కొద్దీ సేపటికే బాలుడి రూపంలో ఉన్న గణపతి, రంగనాధ స్వామి విగ్రహాన్ని భూమిపై పెడతాడు. దీనికి ఆగ్రహించిన విభీషణుడు పరుగున నది నుండి వచ్చి, గణపతిని పట్టుకోవడానికి వెంబడిస్తాడు. బాలుడు వెంటనే  పారిపోతాడు. చాలా దూరం పరిగెత్తిన గణపతి, కొండపైకి వెళతాడు. చివరికి విభీషణుడు, బాలుడిని పట్టుకుని నుదుటిపై గట్టిగా కొడతాడు. దీనితో స్వామి నవ్వుతూ అసలు రూపంలో దర్శనమిస్తాడు. విభీషణుడు వెంటనే క్షమాపణలు కోరడంతో గణపతి, అతనికి ప్రసాదించిన రంగనాధుని విగ్రహం కావేరో నది తీరంలోనే ఉంటుందని వెల్లడిస్తాడు. అనంతరం వినాయకుడు అక్కడే స్వయంబుగా వెలసినట్లు తెలుస్తుంది. వినాయకుడి నుదుటిపై విభీషణుడు కొట్టిన నొక్కు కూడా మనం ఈరోజుకీ చూడవచ్చు. ఈ ఆలయంలో స్వయంబుగా వెలసిన వినాయకుడు, కోరిన కోర్కెలు తీర్చే గణనాయకునిగా ప్రసిద్ధి. తరువాత రంగనాదుని విగ్రహం ఉంచిన ప్రదేశం దట్టమైన అడవులతో కప్పబడి పోతుంది. చాలా కాలం తరువాత చోళుల చక్రవర్తి, ఒక చిలుకను వెంబడించగా ఆ దట్టమైన అడవిలోకి వెళుతుంది. దానిని వెతకగా రంగనాధుని విగ్రహం దర్శనమిస్తుంది. దీనితో చోళుల చక్రవర్తి రంగనాధ ఆలయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయాలుగా  స్థాపించారు. ఇప్పుడే ఇదే శ్రీరంగంగా పిలవబడుతుంది. ఇంతలో పల్లవులు, విభీషణుడు బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వినాయకుడికి ఒక ఆలయాన్ని అలాగే తైమన ఆలయాన్ని కూడా నిర్మించారు.             

రాముడి వల్లే సీత దేవి తనువు చాలించిందా..?

రామాయణం " భక్తితో చదివితే పురాణం.. వికాసం కోసం చదివితే విజ్ఞానం. రామాయణం లో రాముడు సీత కోసం లంకకు  వెళ్ళాడు.లంకలో  సీత రాముడి కోసం ఎదరు చూసింది.వారికి  ఒకరిమీద ఇంకొకరికి ఉన్న...

కాణిపాకం లో జరిగిన అద్భుతం

హిందువులు ఏ పండగ చేసుకున్న లేదా ఇంట్లో ఏ రకమైన పూజలు చేసిన అన్నిటికన్నా ముందు గణపతి ని పూజిస్తారు.. అయితే ఆ గణనాధుడు చిత్తూరు జిల్లా లోని కాణిపాకం అనే గ్రామం...

మహా శివుడి జన్మ రహస్యం

లయ కారకుడు… నీలకంఠుడు… పరమ శివుడు. శివ తత్వం ఆధ్యాత్మికoగనే కాకుండా మానసిక పరిణతికి ఒక చక్కటి మార్గం. ఎంత బాధ అయినా పంటికింద బిగబట్టలని. కాల సర్పాన్ని అయినా మెడలో మాలల...

శ్రీ శైల ఆలయ చరిత్ర

మన పురాతన భారత దేశంలో ఆద్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిసాయి. వాటిలో యుగయుగాలు భక్తకోటిచే నిత్య పూజలు అందుకుంటున్న ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ముఖ్యం. అటువంటి పరమ పావన క్షేత్రాలలో...

ఈ వింత శివాలయం గురించి మీకు తెలుసా ?

మహా దేవుడు ఆది దేవుడు అయిన శివుడు. లోక కంఠకులను అంతం చేసి అదుపులో పెట్టే ఈశ్వరుడు. ప్రళయాన్ని గరళం గా చేసి కంఠం లో బంధించిన నీల కంటుడు. అలాంటి శివుడి...

వరంగల్ వేయి స్థంబాల గుడి చరిత్ర

కాకతీయులు మనకి ఎన్నో అద్భుత కట్టడాలని అందించారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.. వారు అందించిన ఎన్నో అద్భుత కట్టడాల్లో వరంగల్ లోని వేయి స్థంబాల గుడి ఒకటి.. కాకతీయ సామ్రాజా...

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles