#RRR మూవీ టీజర్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

బాహుబలి వంటి సంచలన విజయం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుత దృశ్య కావ్యం ఆర్ ఆర్ ఆర్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలతో రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయిలో ప్రారంభం నుండే ఉన్నది, ఆ తర్వాత ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ మరియు ఎన్టీఆర్ చరణ్ టీజర్స్ ప్రతి ఒక్కటి కూడా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తిని రేపింది, కరోనా మహమ్మారి కారంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది, లేకపోతే ఈ సినిమా ఎప్పుడో విడుదల అయ్యి ఉండేది, దాదాపుగా మూడేళ్ళ నుండి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు తమ హీరోలను వెండితెర మీద చూడలేకపోయారు, ఇన్నేళ్ల వారి ఎదురు చూపులకు తగ్గట్టు గానే, అభిమానుల ఆకలి తీర్చే విధంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఔట్పుట్ వచ్చింది అట, బాహుబలి సిరీస్ లో నాలుగైదు సన్నివేశాలు ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడుచుకొని విధంగా అనిపిస్తే , ఆర్ ఆర్ ఆర్ లో మాత్రం ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా వచ్చింది అట, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పటి వరుకు చూడని విధంగా వచ్చాయి అట.

అయితే ఎప్పటి నుండో అభిమానులు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి ఉన్న టీజర్ ని చూడాలి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, వారి ఎదురు చూపులకి తేరా దించుతూ నవంబర్ 1 వ తారీఖున ఈ సినిమా టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు అట ఆ చిత్ర యూనిట్, అంతే కాకుండా దీపావళి సందర్భంగా విడుదల అవ్వబోతున్న సినిమాలు అన్నిట్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ టీజర్ ని అటాచ్ చెయ్యబోతున్నారు అట, ఇక ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం తో ఇండియాలోనే బిగ్గెస్ట్ థియేటర్స్ చైన్ అయినా పీవీఆర్ టై అప్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే,అంతే కాకుండా తమ థియేటర్స్ పేరు కూడా PVRRR అంటూ మార్చారు, ఇలా జరగడం చైత్ర లో ఇదే తొలిసారి,ఇక ప్రమోషన్స్ విషయం లో రాజమౌళి ఎప్పుడు మన ఊహకి కూడా అందదు అనే విషయం మన అందరికి తెలిసిందే, ఇక ఆర్ ఆర్ ఆర్ విషయం లో కూడా ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చూడని విధంగా కనివిని ఎరుగని రీతిలో ప్రొమోషన్స్ ని చెయ్యబోతున్నారు అట రాజమౌళి అండ్ టీం.

ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ని మీడియా కి మరియు కొంతమంది పాత్రికేయలకు చూపించారు అట, ఆ టీజర్ ని చూసిన వెంటనే అందరికి గూస్ బంప్స్ వాచినట్టు సమాచారం, అభిమానులు ఈ టీజర్ ని చూసిన తర్వాత తమకి అప్పటి వరుకు ఉన్న అంచనాలను పదింతలు చేసుకునే విధంగా ఉంటుంది అట, ఎన్ని అంచనాలు పెట్టుకున్న ఆ అంచనాలను మించి ఇంకా అద్భుతంగా తియ్యడం రాజమౌళి లో ఉన్న స్పెషాలిటీ,ఆర్ ఆర్ ఆర్ విషయం లో కూడా మరోసారి అది రుజువు కాబోతుంది, ఇక ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగన్ ఒక్క ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇక ఆయనకి జోడిగా శ్రియా నటించింది, ఇక రామ్ చరణ్ కి జోడిగా అలియా భట్ హీరోయిన్ గా నటించగా, ఎన్టీఆర్ కి జోడిగా ఒలీవ మోరిస్ అనే కొత్త అమ్మాయి నటిస్తుంది, కీరవాణి ఇచ్చిన సంగీతం ఈ సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళినది అట, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రొమోషన్స్ ఈ రెండు నెలలు ఒక్క రేంజ్ లో ప్రొమోషన్స్ చేసి జనవరి 7 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలో విడుదల కాబోతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles