RRR లో అల్లూరి సీత రామరాజుగా మహేష్ బాబు ని ఎందుకు తీసుకోలేదు..?

రాజమౌళి మహేష్ బాబు, ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే.. వినడానికి ఎంత బాగుందో కదా, టాలీవుడ్ అర్గ హీరోలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పటి వరకు అపజయం అంటే ఏంటో తెలియని డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమా ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అని బద్దలు కొడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని సినిమాని అభిమానించే ప్రతి ఒకరు ఎదురు చూస్తారు.. కానీ నిజంగానే వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనే విష్యం పక్కకి పెడితే, సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లు సీతారామరాజు సినిమా తీసి అల్లూరి అంటే ఇలానే ఉంటాడేమో అన్న విధంగా తెలుగు ప్రజల గుండెల్లో ముద్ర వేసాడు..

అల్లూరి సీత రామ రాజుగా కృష్ణ ఆ పాత్రలో నటించాడు అని అనడం కంటే ఆ పాత్రకే ప్రాణం పోసాడు అని చెప్పొచ్చు, మరి ఇన్ని ఏళ్ళ తర్వాత రాజమౌళి మల్లి అల్లూరి సీతారామ రాజు పాత్రా ని తెరమీదకు తీసుకొస్తున్నాడు.. ఈ సారి అల్లూరి సీతారామ రాజు గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించునున్నాడు, ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటిస్తుం ఉండడం అందులోనూ రాజమోళి సినిమా కావడం తో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో బారి అంచనాలే ఉన్నాయ్.. కాకపోతే అల్లూరి సీత రామరాజు గా కృష్ణ గారి అబ్బాయి అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు ని తీసుకోని ఉంటె బాగుండేదేమో అని చాల మంది అనుకున్నారు ఇదే విషయాన్ని ఒక విలేకరి RRR సినిమా కి సంబందించిన ఒక ప్రెస్ మీట్ లో రాజమౌళి గారిని అడిగారు, అందుకు రాజమౌళి గారు సమాధానం ఇస్తూ నేను ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ ని హీరోలు గా అనుకున్నాను, ఈ విష్యం పక్కకుపెడితే నేను మహేష్ బాబు తో సినిమా తీయాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విష్యం నాకు తెలుసు నాకు కూడా తనతో సినిమా తీయాలనే ఉంది కాకపోతే అల్లూరి సీతారామ రాజుగా నేను మహేష్ బాబు ని ఈ సినిమాలో తీసుకోకపోవడానికి కారణం ప్రేక్షకులే అని చెప్పాడు జక్కన..

తాను ఈ సినిమా తీసే ముందు, మహేష్ బాబు తో నేను సినిమా తీస్తే ఎలాంటి సినిమా తీయాలా అని ఆలోచించుకుంటూ, అసలు ప్రేక్షకులు నేను మహేష్ బాబుని ఎలా చూపించాలని కోరుకుంటున్నారో తెలుసుకుందాం అని ఒక పోల్ ని పెట్టాడంట, రాజమౌళి పెట్టిన ఈ పోల్ కి చాల తక్కువ మంది మహేష్ బాబు ని అల్లూరి సీతారామా రాజుగా చూడాలని అనుకుంటున్నారు అని అంతే కాకుండా ఒకవేళ మా కాంబినేషన్ లో సినిమా వస్తే ఎక్కువ మంది మహేష్ బాబు ని జేమ్స్ బాండ్ గా చూడాలని అనుకుంటున్నట్టు వోట్ చేసారు అని అందుకే నేను ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు గా మహేష్ బాబు ని తీసుకోలేదు అని రాజమౌళి స్పష్టం చేసారు..

ఇక RRR కి సంబంధించి ఇద్దరి హీరోల లుక్స్ వాళ్ళ బర్త్డే స్పెషల్ గా రెండు టీజర్స్ గా విడుదల చేసాడు జక్కన, ఈ టీజర్స్ చూసాక ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి, మెగా ఫాన్స్ ఇంకా నందమూరి ఫాన్స్ తో పాటు ప్రతి సినిమా అభిమాని ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు అనడం లో ఎలాంటి సండేదం లేదు, ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నట్టు ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విష్యం తెలిసిందే.. ఈ సినిమా విడుదల అయ్యాక ఎన్ని రికార్డ్స్ బాధలు కొడుతుందో వేచి చూడాలి మరి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles