#RRR లో ఎన్టీఆర్ పాత్ర గురించి రాజమౌళి షాకింగ్ కామెంట్స్

బాహుబలి వంటి సంచలన విజయం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుత దృశ్య కావ్యం ఆర్ ఆర్ ఆర్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలతో రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయిలో ప్రారంభం నుండే ఉన్నది, ఆ తర్వాత ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ మరియు ఎన్టీఆర్ చరణ్ టీజర్స్ ప్రతి ఒక్కటి కూడా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తిని రేపింది, కరోనా మహమ్మారి కారంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది, లేకపోతే ఈ సినిమా ఎప్పుడో విడుదల అయ్యి ఉండేది, దాదాపుగా మూడేళ్ళ నుండి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు తమ హీరోలను వెండితెర మీద చూడలేకపోయారు, ఇన్నేళ్ల వారి ఎదురు చూపులకు తగ్గట్టు గానే, అభిమానుల ఆకలి తీర్చే విధంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఔట్పుట్ వచ్చింది అట, బాహుబలి సిరీస్ లో నాలుగైదు సన్నివేశాలు ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడుచుకొని విధంగా అనిపిస్తే , ఆర్ ఆర్ ఆర్ లో మాత్రం ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా వచ్చింది అట, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పటి వరుకు చూడని విధంగా వచ్చాయి అట.

ఇది ఇలా ఉండగా రాజమౌళి ఇటీవల శ్రీకాకుళం లో జెమ్స్ మెడికల్ కాలేజీ లో సరదాగా కాసేపు ముచ్చటించారు, ఇక్,అడా విద్యార్థులు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు, ఒక్క విద్యార్థి పైకి లేచి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర నిడివి కేవలం 30 నిమిషాలే ఉంటుంది అంట కదా నిజమేనా సార్ అని అడిగిన ప్రశ్న కి రాజమౌళి సమాధానం చెప్తూ ‘అంత తక్కువ క్యారక్టర్ నేను తారక్ కి పెడితే ఆయన అభిమానులు నన్ను బయట తిరగనిస్తారా అసలు , ఇలాంటి కామెడీ మాటలు ఎవరు చెప్తారు మీకు, హీరోలిద్దరుయ్ ఒక్కరు ఎక్కువ కాదు , ఒక్క తక్కువ కాదు, సరిసమానంగా పవర్ ఫుల్ గా ఇప్పటి వరుకు వెండితెర మీద చూడనంత పవర్ ఫుల్ గా వాళ్ళిద్దరి పాత్రలు ఉంటాయి, సినిమా చూసిన తర్వాత గర్వంగా ఇది మన తెలుగు సినిమా అని చెప్పుకునే విధంగా ఉంటుంది’ అని రాజమౌళి సమాధానం ఇచ్చాడు, అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ టీజర్ రేపు విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక ఒక్క విద్యార్థి పైకి లేచి పవన్ కళ్యాణ్ గారితో మీ సినిమా చూడాలి అని ఎప్పటి నుండో మేము కోరుకుంటున్నాము, భవిష్యత్తులో అయినా అది కుదురుతుందా లేదా అని అడిగిన ప్రశ్న కి రాజమౌళి సమాధనం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ గారితో సినిమా చెయ్యాలని నేను కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను, ఒక్క సారి ఆయనని నేను కలిసాను, ఆయనతో మాట్లాడుతునంత సేపు నేను చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను,మీతో సినిమా చెయ్యాలని ఉంది సార్, మీకు ఎలాంటి కథ కావాలి అని అడిగాను, ఆయన దానికి సమాధానం చెప్తూ మీరు ఎలాంటి కథని ఐన తీసుకొని రండి చేద్దాము, ఆ కథ చెయ్యాలి ఈ కథ చెయ్యకూడదు అని నాకు ఏమి ఉండదు, మీరు ఎలాంటి మంచి కథ తెచ్చిన నేను చేస్తాను అంటూ చెప్పారు, ఓకే సార్ అని చెప్పి నేను వెళ్ళిపోయాను, ఆ తర్వాత ఒక్కటిన్నర సంవత్సరం దాటినా ఆయన నుండి ఎలాంటి పిలుపు నాకు రాలేదు, ఆ తర్వాత ఆయన తన సినిమాలతో బిజీ అయ్యాడు, నేను కూడా నా థింకింగ్ ని మార్చుకున్నాను, మాస్ సినిమాలను పక్కన పెట్టి మగధీర , యమా దొంగ, బాహుబలి వంటి సబ్జక్ట్స్ వైపు నా మనసు మరలింది, ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలకంటే ఎక్కువగా పాలిటిక్స్ మీద శ్రద్ద పెట్టారు , ఆలా మా ఇద్దరు కాంబినేషన్ మిస్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles